క్యాడర్ హోప్స్ పెట్టుకోవద్దని హింట్స్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్ ను ఆర్తికంగా చితికిపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగులు కట్టి నష్టపోకుండా ఉండేందుకు ఆయన మెల్లగా హింట్స్ ఇస్తున్నారు. దాదాపుగా ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన కౌంటింగ్ ప్రక్రియపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. కౌంటింగ్ అయినా సక్రమంగా జరుగుతుందా.. అని ఆయన దీర్ఘాలు పోతూ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రక్రియను గుప్పిట్లో పెట్టుకునేందుకు సజ్జల ప్రయత్నాలు చేశారు. ఈసీ ఆదేశాలు అమలు కాకుండా చేయడంలో ఆయన గుప్పిట్లో ఉన్న అధికారులే కీలకం. గెలిచే అవకాశమే ఉంటే.. ఇలా దాడులు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పోలీసు వ్యవస్థ చేతుల్లో ఉన్నప్పుడే కసి.. కక్ష తీర్చుకోవాలని డిసైడయ్యారు. ఆ పని చేశారు. పోలీసులు తర్వతా కఠిన చర్యలు తీసుకుంటారని.. ఇంకా ఈసీ చేతుల్లోనే పాలన ఉందని సజ్జలకు తెలియకుండా ఎలా ఉంటుంది ?. అందుకే ఈసీ టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాలు పాటించిందని సజ్జల అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పడానికి ఇంత కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు.

2019 ఎన్నికల సమయంలో టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తమ పరిపాలన సంక్షేమ, అభివృద్ధి సమతూకంగా నడిచిందని ప్రజల మీద అసలు భారం వేయకుండా పాలన చేశామని అనుకున్నారు. అందుకే పార్టీ హైకమాండ్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరికి అది నమ్మకంతో సొంత పార్టీ క్యాడర్ బెట్టింగులు గట్టిగా పెట్టుకోవడానికి కారణం అయింది. అలా కూడా పార్టీ క్యాడర్ నష్టపోయింది. ఈ సారి అలాంటి పరిస్థితి వైసీపీ క్యాడర్ కు రాకుండా ఉండేందుకు సజ్జల ముందస్తుగా హింట్స్ ఇస్తున్నారని.. ఓటమికి కారణాలు చెబుతున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపు అనేదే లేదా ? ఆఫీసర్లకు పేర్ని నాని హెచ్చరిక

వైసీపీ నేతల ఆర్తనాదాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఎంతగా అంటే.. చివరికి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. ఏ ఒక్కరినీ వదలం.. రేపు అనేది లేదనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఎవరిపైన అంటే.....

ఏబీవీకి పోస్టింగ్ – తెర వెనుక చాలా జరిగింది !

ఏబీవీకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. కానీ రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. తెల్ల వారే సరికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం, పోస్టింగ్ ఇవ్వడం , రిటైర్మెంట్...

సజ్జలపై క్రిమినల్ కేసు… పోలీసులకు ఆ ధైర్యం ఎక్కడిది..?

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అలా ఫిర్యాదు అందిందో లేదో, ఇలా కేసు నమోదు కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐదేళ్లుగా వ్యవస్థలన్నింటిని కనుసైగలతో శాసించిన సజ్జలపై కేసు. అదీ క్రిమినల్ కేసు...

సినిమా థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్

అవును... మీరు చ‌దివింది నిజ‌మే. మూవీ థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్ టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఎవ‌రు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారం చేప‌డ‌తారా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close