ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత కీలకమైన నిర్ణయం ముఖ్యమంత్రికి తెలియకుండా తీసేసుకుంటారా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేక స్పందన తీవ్రంగా వచ్చినప్పుడు… ప్రభుత్వం ఇలానే చెబుతుందన్నమాట. కొన్నాళ్ల క్రితం జగన్ విశాఖకు వెళ్లినప్పుడు.. ట్రాఫిక్ ఆపేశారని ప్రజలు శాపనార్ధాలు పెట్టారు. దీంతో జగన్ తర్వాతి రోజు ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి అలా జరగకూడదని ఆదేశించారు. కానీ ఆగలేదు..ఇంకా చెప్పాలంటే పరదాలు.. బారీకేడ్లు కట్టి.. రెండు రోజుల ముందు నుంచే ట్రాఫిక్ ఆపేస్తున్నారు. ఇదీ అంతే.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించాలని ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోందనేది బహిరంగరహస్యం. చాలా మందికి జీతాలు సరిగ్గా ఇవ్వక.. జీతాల పరిమితి పెట్టి వెళ్లిపోయేలా చేశారు. ఉన్న వారిని తొలగించాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం తీరుపై అందరూ ఒక్క సారిగా తిరుగుబాటు లాంటి ఆగ్రహం చూపించడంతో సజ్జల మాట మార్చారు. సీఎం ఆగ్రహించారని అంటున్నారు. మరి ఆ జీవోను వెనక్కి తీసుకుంటున్నారో లేదో చెప్పలేదు. కానీ శాఖల పరంగా ఎమైనా నిర్ణయాలుంటే తీసుకుంటారంటున్నారు. అంటే తీసివేతలు ఉంటాయన్నమాట.

ఇదే అంశంపై బొత్స సత్యనారాయణ కూడా అదే రీతిలో స్పందించారు. అందరు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం లేదని పనిలేనోళ్లు ఉంటే వాళ్లను తొలగించడానికే జీవో ఇచ్చారని.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని వాదించారు. అంటే ఆ జీవో కరెక్టే. కానీ ప్రచారం మాత్రం తప్పు అన్నట్లుగా బొత్స చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేస్తోంది.. కానీ అలా చేస్తున్నామని ధైర్యంగా చెప్పడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత అత్యధిక పని వారికి అప్పగించి.. ఇతర శాఖల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పని లేదని చెప్పి తీసేస్తున్నారు. ఈ విషయాన్నే బొత్స పరోక్షంగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close