విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి కూడా విజయ్ అంటే ఇష్టం. తెలుగులో తన ఫేవరేట్ స్టార్స్ లిస్టు లో విజయ్ పేరు కూడా చెబుతుంది జాన్వీ. అంతేకాదు.. ఒక సందర్భంలో ‘‘మీకు ఒకవేళ స్వయంవరం ఏర్పాటు చేస్తే పరిశ్రమ నుంచి ఎవరు అందులో పాల్గొనాలని అనుకుంటున్నారు’’? అనే ప్రశ్నకు .. విజయ్ పేరుని కూడా ప్రస్థావనకు తీసుకురావడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.

అదలావుంచితే.. జాన్వీ, విజయ్ ఫ్యామిలీల మధ్య కూడా మంచి అనుబంధం వుంది. ఇటివలే ముంబైలో విజయ్ ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్ళాడు. ఈ యాడ్ లో జాన్వీ కూడా నటించింది. ఈ సందర్భంగా విజయ్ తల్లి మాధవి జాన్వీ ని కలిసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటో కూడా ఇప్పుడు బయటికి వచ్చింది. షూటింగ్ తర్వాత విజయ్ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించిందట జాన్వీ. విజయ్, జాన్వీ కలసి సినిమా చేస్తే బావుంటుందని ఎప్పటినుండో అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికైతే సినిమా కుదరలేదు కానీ ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం కుదిరింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close