రాజధానిపై వైసీపీ కుట్రలు ఏ మాత్రం ఆగడం లేదు. అది ముంపు ప్రాంతమని చెప్పేందుకు లేనిపోని నాటకాలు ఆడుతూనే ఉంది. ఓ వైపు నిర్మాణాలు శరవేగంగా జరగుతున్నాయి. మరో రెండేళ్లలో.. కోర్ క్యాపిటల్ నిర్మాణం పూర్తయిపోతుంది. అయితే ఇప్పుడు త్వరగా రాజధానిని పూర్తి చేయాలని.. లేకపోతే మళ్లీ వికేంద్రీకరణ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం ప్రారంభించారు.
గుంటూరు, విజయవాడ మధ్య ఐదు వందల ఎకరాల్లో రాజధాని కట్టడమే శాశ్వత పరిష్కారమని..గతంలో తాము రాజధాని మారుస్తామని చెప్పలేదని నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు. లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారని.. అప్పులు లేకుండా కట్టాలని అంటున్నారు. పునాదులు వేసిన రాజధానిని ఆపేసి.. ఐదు సంవత్సరాల పాటు స్మశానం అని.. మరొకటని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఒక్క ఇటుక పేల్చకపోగా రోడ్లను తవ్వేసి మెటీరియల్ అమ్ముకున్నారు. మూడు రాజధానుల పేరుతో అత్యంత ఘోరంగా రాజకీయాలు చేసి.. పాతాళానికి పడిపోయారు.
ఇప్పుడు ఏపీ రాజధానికి ఓ రూపు వస్తూండటంతో మరోసారి రాజకీయాలు ప్రారంభించారు. అప్పులు అని.. అదని ఇదని వాగడం ప్రారంభిచారు. తాము అమరావతి రాజధానికి అనుకూలం అని చెప్పినా చెప్పకపోయినా వైసీపీని నమ్మేవారు ఎవరూ లేరు. జగన్ రెడ్డి పరిపాలనా నిర్వాకం.. రాజధానిపై ఆయన విజన్ అంతా అనుభవించారు కూడా. ఇప్పుడు వారు అమరావతిపై ఎలాంటి కామెంట్లు చేసినా.. అది వారిని నగుబాటుకు గురి చేస్తుంది కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మరు.