వైసీపీ అధినేత జగన్ రెడ్డి గురించి ఇప్పుడు బయట ఏమనుకుంటున్నారు?. సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు?. పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ? అని అంతర్గతంగా ఆ పార్టీ నేతలు ఆరా తీస్తే వారికి అసలు విషయం బోధపడుతుంది. జగన్ రెడ్డి ప్రెస్మీట్ అంటే జబర్దస్త్ షోలా చూస్తున్నారని.. తప్పుడు ప్రకటనలు, విచిత్రమైన అన్వయింపులు, తన తెలివితేటల్ని బయట పెట్టే వ్యాఖ్యలతో ఆయనకు అసలు ఏమీ తెలియదని.. అందిరకీ తెలిసిన విషయాలను కూడా అలవోకగా అబద్దాలుగా చెప్పే వ్యక్తి అని ముద్ర పడిపోయింది. ఆయన చేసే కామెడీ ట్రోలింగ్ స్టఫ్ అవుతోంది. ఉన్న ఇమేజ్ కాస్తా పలుచబడిపోతోంది. ఇదంతా ఓ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. చేస్తోంది టీడీపీ కాదు.. వైసీపీ స్ట్రాటజిస్టులే.
సైంటిస్ట్ జగన్ – డేటాకు మైండ్ అప్లయ్ చేస్తే ఏఐ
ఎప్పుడో ఓ సారి ఏపీకి వచ్చి .. తాను వచ్చానని ఉనికి చాటుకునేందుకు ఓ ప్రెస్ మీట్ పెట్టే ఆయన.. ప్రతీ సారి సోషల్ మీడియాకు జబర్దస్త్ షో చేయిస్తున్నారు. ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా ఆ డైలాగ్ మాడ్యూలేషన్ తో .. అంతా తేలిపోతోంది. గురువారం ప్రెస్ మీట్ లో ఆయన డేటాపోఖ్యానం చేశారు. డేటాకు.. మైండ్ అప్లయ్ చేస్తే అదే ఏఐ అని ప్రకటించేసి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంద మాదిరి తెలివితేటలలతో జనాల్ని పిచ్చివాళ్లను చేసే ప్రయత్నం .. ఆయనకు ఈ స్థాయిలో విలువ ఇవ్వాల్సి రావడం.. అద్భుతహా అనుకుంటున్నారు. ఇలాంటి స్ట్రాటజీలు చెప్పాలని రాసి ఇచ్చి పంపేవారి మనసులో కుట్ర లేదని అనుకోగలమా?
హోదానే కాదు.. క్రెడిట్ కావాలని అడుక్కోవడం ఏమిటి?
చంద్రబాబుకు క్రెడిట్ ఇచ్చే అలవాటు లేదని.. గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ సెంటర్ తమకూ ఇవ్వాలని జగన్ రెడ్డి చేసిన డిమాండ్ వైసీపీ కార్యకర్తల్ని కూడా నిర్వేదానికి గురి చేసింది. ఇప్పటి వరకూ ఆయన ప్రత్యేకహోదానే అడుక్కుంటున్నారని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చేసే పనుల్లోనూ క్రెడిట్ ఇవ్వాలని అడుగుతున్నారు. అదానీ డేటా సెంటర్ 2019లో చంద్రబాబు ఓడిపోకే ముందే శంకుస్థాపన జరిగింది. దాన్ని జగన్ రెడ్డి మళ్లీ శంకుస్థాపన చేశారు. దాన్ని నేనుతెచ్చానంటారు. దానికి కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్ అంటారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర లేదంటారు. కంప్యూటర్లు కూడు పెట్టవన్న వైఎస్ అభివృద్ధి చేశాడంటారు. ఇలాంటివన్నీ ప్రస్తావించాలని జగన్ రెడ్డికి చెప్పే సజ్జల ఆలోచనల్లో .. కుట్ర లేదని ఎలా అనుకోగలం?
అదానీ కడితే అదానీ చెప్పుకోరా.. జగన్ చెప్పాలా ?
అది గూగుల్ డేటా సెంటర్ కాదు.. అదానీకి డేటా సెంటర్ అని జగన్ రెడ్డి అంటున్నారు. మరి అదే విషయాన్ని అదానీ ఎందుకు చెప్పుకోవడం లేదంటే ఆ విషయాన్ని చంద్రబాబును అడగాలని మీడియా ప్రతినిధికి చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ కాకపోతే.. సుందర్ పిచాయ్ ఎందుకు చెబుతారు. కేవలం అసోసియేట్ అవుతున్నామని .. అదీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో అని ఆదాని గ్రూప్ క్లారిటీ ఇచ్చింది. అయినా జగన్ రెడ్డి ఆ డేటా సెంటర్ ను అదానీకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి సిల్లీ లాజిక్స్ చెప్పించి జగన్ రెడ్డిని జోకర్ చేసే ప్రయత్నాలు వెనుక సజ్జల ప్లాన్లు లేవని ఎవరైనా అనుకోగలరా?
జగన్ ఇమేజ్ ను చులకన చేస్తున్న సజ్జల – పెద్ద ప్లాన్!
జగన్ రెడ్డిని చులకన చేయడం ద్వారా.. ఆయనను జనాల్లో పలుచన చేస్తున్నారు. ఆయన మాటలతో.. ఆయనకేమీ తెలియదన్న విషయాన్ని ప్రజలకు తెలియచేస్తున్నారు. ఆయన ద్వారానే.. తానో జీరో అనే అభిప్రాయాన్ని ప్రజలకు కల్పిస్తున్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న కుట్ర. జగన్ కు అర్థం చేసుకునేంత తెలివి లేదు కాబట్టి.. సాగిపోతోంది.కానీ ఇలా కుట్రలు చేయడం దేనికి సంకేతం?. సజ్జల జగన్ రెడ్డిని జీరో చేసి.. ఏం చేయాలనుకుంటున్నారు ? అన్నదే చాలా మందికి అర్థం కాని విషయం.
