వైసీపీ పార్టీకి అధ్యక్షుడు ఎవరు అంటే అదేం ప్రశ్న గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తల్లిని కూడా తొలగించి ఏకైక శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగనే కదా అన్న సమాధానం అందరి దగ్గర నుంచి వస్తుంది. మరి అధ్యక్షుడు అధ్యక్షుడిలా పని చేస్తున్నాడా అంటే.. నీళ్లు నమలాల్సిందే. ఆయన హెడ్ క్వార్టర్ బెంగళూరు. అప్పుడప్పుడూ వస్తూంటారు. బెంగళూరులో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను పట్టించుకోరు. మరి పార్టీని ఎవరు నడుపుతున్నారు అంటే.. ఇంకెవరు సజ్జల రామకృష్ణారెడ్డినే. ఇప్పుడు ఆయన అప్రకటిత వర్కింగ్ ప్రెసిడెంట్. అన్నీ పనులు చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్.
జగన్ పార్ట్ టైమ్ – సజ్జల ఫుల్ టైమ్
సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు అధికారం పోయాక పార్టీ మొత్తం ఆయన గుప్పిట్లోకి వచ్చింది. విజయసాయిరెడ్డిని దూరం చేశారు. అయోధ్య రామిరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం చేయించి ఆయననూ దూరం దూరంగా ఉంచుతున్నారు. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డిని జైలుకు పంపించారు. మిథున్ రెడ్డిని జగన్ దగ్గరకు రాకుండా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. జగన్ పకకన సన్నిహితంగా ఉండే ఒక్కరు కూడా ఇప్పుడు లేరు.. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప. జగన్ కూడా పట్టించుకోవం లేదు. అందుకే మొత్తం ఆయన గుప్పిట్లోకి వెళ్లిపోయింది.
జగన్ కూ మరో దారి లేకుండా చేసిన సజ్జల
వైసీపీలో ఇప్పుడు జగన్ రెడ్డి చెప్పినా ఎవరూ వినరు..కానీ సజ్జల చెబితే మాత్రం సాగిపోతుంది. ఎందుకంటే జగన్ కు చెప్పేది కూడా సజ్జలనే. సజ్జల ఇక్కడ అత్యంత తెలివిగా వ్యవహరిస్తారు. జగన్ కు ఏం కావాలో.. ఆయన మనస్థత్వం ఏమిటో బాగాస్టడీ చేశారు కాబట్టి ఆయన మనసుకు తగ్గట్లుగా వ్యవహరిస్తారు. ఆయన బయటకు వెళ్లినప్పుడు స్కిట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. దండాలు పెట్టిస్తారు. దాన్ని చూసి జగన్ కూడా .. అంతా బాగా నడిచిపోతుందని అనుకుంటారు. ఇటు సజ్జల తాను చేయాల్సింది చేసుకుంటూ పోతారు. పార్టీని మెల్లగా తన అనుచరుల గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. సాక్షి మీడియాలోకి కుమారుడ్ని చొప్పించారు. ఇలా మొత్తంగా వైరస్ లా ఆయన విస్తరించారు.
జగన్ జైలుకెళ్తే భారతికి బదులు సజ్జలకే చాన్స్
రేపు జగన్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపించేలా ఆయన జాగ్రత్తలు తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు. సోషల్ మీడియా టీములన్నీ ఆయన గుప్పిట్లోనే ఉంటాయి. చెప్పినట్లుగా పోస్టులు పెట్టాలి. జగన్ జైలుకెళ్తే భారతికి పార్టీ పగ్గాలివ్వాలని జగన్ అనుకుంటారు. కానీ భారతి పగ్గాలు చేపడితే ప్రజలు తిరస్కరిస్తారన్న నెరేటివ్ ను ఆయన త్వరలోనే ప్రారంభించబోతున్నారని.. దానికి తగ్గ గ్రౌండ్ ను రెడీ చేశారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీని గుప్పిట పట్టిన సజ్జల.. జగన్ రెడ్డి చేతకాని తనాన్ని ఆసరా చేసుకుని.. తన రాజకీయం తాను చేస్తున్నారు.
