సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో నెంబర్ టు. జగన్ జైలుకెళ్తే నెంబర్ వన్. ఆయన జగన్ రెడ్డికి ఏం సలహాలిస్తున్నారో కానీ మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి ..లిక్కర్ కేసులో లాయర్లకు కూడా ఆయనే సలహాలిస్తున్నారా అన్న డౌట్ చాలా మందికి వస్తోంది. ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి చట్టం ఇంత సింపుల్ గా ఉంటుందా.. తప్పులు చేసి ఇంత ఈజీగా తప్పించుకోవచ్చా.. ఆధారాలు లేకుండా నేరం చేసేశామని ఎలా నిరూపిస్తారని ఎదురుదాడికి దిగవచ్చా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నిలబడే కేసు కాదని ముందే తీర్పు
సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల మీడియా ముందుకు లిక్కర్ స్కాం నిలబడే కేసు కాదని తేల్చేశారు. ఆయన చెప్పిన మాట కాదు.. వైసీపీ నేతలు అంతా అదే చెబుతున్నారు. చివరికి లొంగిపోతున్న , పట్టుబడుతున్న నిందితులు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. అదే చెబుతున్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తారన్న భయంతో దుబాయ్ నుంచి వచ్చి దొరికిపోయిన వరుణ్.. ఇది నిలబడే కేసు కాదని కొన్నాళ్లు దుబాయ్ లో ఉండి రావాలని పంపించారని పోలీసులకు చెప్పాడు . అంటే నిందితులంతా అదే చెబుతున్నారు. సజ్జల ఇచ్చిన సలహా వారికి అంత బాగా నచ్చిందన్నమాట.
నష్టం.. నిరూపణ గురించి వ్యాఖ్యలు
నేరం నిరూపించాలంటే ఎక్కడ, ఎవరికి నష్టం జరిగిదో చూపించాలని.. ఎక్కడ నష్టం జరిగిందని సజ్జల తాజాగా కోర్టు ముందు నిలబడి మీడియాతో వాదించారు. ఆయనకు కనిపిస్తే నష్టం లేకపోతే లాభమని ఎందుకని అనుకుంటున్నారో కానీ.. ప్రజల ఆరోగ్యాలను సైతం దోచుకున్న వ్యవహారం అంతా నష్టమేనని ఆయన అనుకోవడం లేదు. అయితే అలాంటి నష్టాన్ని నిరూపించలేరని ఆయన నమ్ముతున్నారు. అదే మాటల్ని నిందితులకు చెప్పి దైర్యం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
చట్టం చేతులు చాలా పెద్దవి – మభ్యపెట్టలేరు!
కళ్ల ఎదురుగా దోపిడీ చేసినా.. అంతా నగదుతో పూర్తి చేశాం.. కాబట్టి నమ్మించలేరు.. నిరూపించలేరు.. నష్టం జరగలేదు వంటి పదాలతో కేసు నిలబడదని అడ్డగోలు వాదనలు వినిపించడం మీడియా ముందు సాధ్యమవుతుంది కానీ కోర్టులో కాదు. వ్యవస్థను తక్కువ అంచనా వేయడమే అది. లిక్కర్ స్కాంలో ఎదురుగా కనిపిస్తున్న వాస్తవల్ని కూడా ఆధారాలు లేవని వాదించడం తేలికే కానీ.. వ్యవస్థలు అంత గుడ్డిగా ఉండవని సజ్జల అర్థం చేసుకోవాల్సి ఉంది. సాక్షి లో రాసే అడ్డగోలు రాతలను .. తీసుకొచ్చి.. అదే ఐడియాలతో లిక్కర్ కేసు నుంచి బయటపడాలనుకుంటే… వ్యవస్థల పవర్ ఏంటో చూపిస్తాయి.