మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే… నవ్వొస్తుంది… అధికార పార్టీ నేతలప ఇళ్లపై ప్రభుత్వం ఎందుకు దాడులు చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. మా మంత్రులు, ఎమ్మెల్యేలపై మేం ఎందుకు దాడులు చేస్తాం… అలా దాడులు చేయించుకుని ఏం సాధిస్తామని ఆయన ప్రశ్నించారు. విపక్ష నేతల ఆరోపణలపై ప్రజలు చీదరించుకుంటారు. ఇవి దుర్మార్గపు రాజకీయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అటాక్ ప్లాన్ చేసింది చేయించింది.. దాన్ని మాపై వేయాలని చూస్తుంది విపక్షాలు అని ఆయన ఆరోపించారు. విపక్ష నేతలందరూ కూడబలుక్కుని ఒకే విధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివారని సజ్జల విమర్శిస్తున్నారు.

ఓ వైపు సజ్జల.. వైసీపీ నేతలు… తమకేం సంబంధం లేదని చెబుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో అల్లర్లకు కారణంగా భావిస్తున్న అన్యం సాయి అనే వ్యక్తితి పోలీసులు పట్టుకున్నారు. సీసీ టీవీ కెమెరాలో అతని వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతను విశ్వరూప్‌కు అనుచరుడని కొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. జనసేనలోనూ కీలకంగా పని చేశాడని మరికొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు కానీ.. ఆయనపై గతంలో రౌడీ షీట్ఉందని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తేశారని చెబుతున్నారు.

మరో వైపు తన ఇంటిపై దాడి చేసిన వారిలో అన్ని పార్టీల నేతలూ.. చివరికి తమ పార్టీ వారు కూడా ఉన్నారని.. మంత్రి విశ్వరూప్ చెబుతున్నారు. తమ పార్టీ కౌన్సిలర్ ఉన్నాడని… టీడీపీ, జనసేన, బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలున్నారనిచెబుతున్నారు. ఎవర్నీ వదిలి పెట్టబోమని అంటున్నారు. మొత్తంగా ఈ దాడి వ్యవహారం రాజకీయం అయిపోయింది. ఎవరికి వారు ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలీసులు మాత్రం ఇంకా సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించే ప్రయత్నాల్లోనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close