వైసీపీలో ఉండాలంటే.. దోపిడీలు, దొంగతనాలు, ఖూనీలు, స్కాంలు చేసి ఉండాలన్న అర్హతను జగన్ రెడ్డి నిర్దేశించారు. గంజాయి బ్యాచ్ కు ఆయన పరామర్శ తర్వాత అంతా బహిరంగమే అయింది. దేశంలో సంచలనం సృష్టించే నేరాలు ఏం జరిగినా అందులో వైసీపీ నేతల పాత్ర ప్రముఖంగా బయటపడుతోంది. తాజాగా మెడికల్ కాలేజీల్లో తనిఖీలు ఆఫర్ చేసే బృందానికి లంచాలు ఆఫర్ చేస్తున్న ముఠా సీబీఐకి పట్టుబడింది. అందులోనూ వైసీపీ నేత కింగ్ పిన్ గా ఉన్నారు.
CBI దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల తనిఖీలలో లంచాల కేసులో 34 మందిని బుక్ చేసింది. ఇందులో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అధికారులు, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తనిఖీ బృందం డాక్టర్లు, పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులు ఉన్నారు. ఈ స్కాంలో లంచాలకు మధ్యవర్తిగా వ్యక్తి కదిరికి చెందిన వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ రింగ్. సీబీఐ కదిరి సమీపంలోని ఆయన ఇంట్లో సోదాలు కూడా చేసింది.
మెడికల్ కాలేజీల్లో వసతులు లేకపోయినా, తగినంతమంది బోధనా సిబ్బంది లేకపోయినా.. ఎన్ఎంసీ తనిఖీ బృందాలకు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులకు లంచాలు ముట్టజెప్పి అనుమతులు ఇప్పించే స్కాంను ఆయన నడిపించారు. చెన్నైలో సెటిల్ అయిన అత్తల హరి ప్రసాద్ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల వ్యవహారాల్లో గోల్మాల్ చేయడంలో రాటుదేలిపోయారు. వందల కోట్ల ఆస్తులు పోగేశారని చెబుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడిగా పేరున్న ఆయన కదిరి ఎమ్మెల్యే టిక్కెట్ కూ ప్రయత్నించారు. బహుశా వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారేమో ?