సాక్షికి ఇప్పుడు ఏపీలో వ్యవస్థలు గుర్తుకొచ్చాయా..?

దేశంలోని వ్యవస్థలన్నింటినీ ప్రధాని నరేంద్రమోడీ నిర్వీర్యం చేస్తున్నారని… దేశాన్ని రక్షించుకోవడం కోసం.. సేన్ నేషన్ కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… ప్రకటించి కార్యాచరణ ప్రారంభించారు. దానికి కౌంటర్‌గా .. బీజేపీ నేతలు… వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు కానీ.. వైసీపీ అధినేత జగన్ మీడియా మాత్రం… నేరుగా చంద్రబాబుపై ఎదురుదాడికి దిగుతోంది. ఏపీలోవ్యవస్థల్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని.. ఏకంగా బ్యానర్ కథనం వండేశారు. అందులో .. జన్మభూమి కమిటీల దగ్గర్నుంచి ఫిరాయింపుల నిరోధక చట్టం వరకూ.. చాలా అంశాలను చేర్చారు. అసలు ఇవి వ్యవస్థలా.. అంశాలా.. అన్నదానిపైనా.. సాక్షికి క్లారిటీ లేదు. తనకు తోచిన ప్రతీ అంశాన్ని ఓ వ్యవస్థలా మార్చి.. అందులో జరిగాయో లేవో కూడా తెలియని అంశాల్ని చేర్చి… చంద్రబాబుపై ఎదురుదాడి చేయాలనుకున్న వ్యూహాన్ని మాత్రం అమలు చేసింది.

ఏపీలో వ్యవస్థలపై.. సాక్షి మీడియా బ్యానర్ కథనం.. కచ్చితంగా.. బీజేపీ నేతల్ని సంతృప్తి పరిచేదే. వ్యవస్థలను తీవ్రంగా తొక్కి పడేస్తున్న నరేంద్రమోడీ తీరుపై.. దారుణంగా విరుచుకుపడుతున్న చంద్రబాబుపై… బీజేపీ నేతలు.. కచ్చితంగా.. ఇలాంటి కథనాన్నే కోరుకుంటారు. బహుశా.. రామ్‌మాధవ్ లాంటి నేతల ఆలోచనే ఇది కావొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. నిజానికి.. సీబీఐ , ఆర్బీఐ లాంటి వ్యవస్థలపై.. బీజేపీ , ఆరెస్సెస్ చేస్తున్న దాడిని .. సాక్షి మీడియా ఎప్పుడూ ప్రముఖంగా ప్రచురించలేదు. సీబీఐలో జరిగిన పరిణామాల్ని కూడా… చంద్రబాబుకు అంటగట్టడానికి ప్రయత్నించారు. సీబీఐలో ఉన్న వాళ్లంతా.. చంద్రబాబు మనుషులని చెప్పుకొచ్చారు. కొత్తగా వచ్చిన తాత్కాలిక సీబీఐ డైరక్టర్ మన్నెం నాగేశ్వరరావు కూడా చంద్రబాబు మనిషేనని రాసుకొచ్చారు. ఆ తర్వాత అదే సీబీఐ విచారణను.. కోడికత్తి ఘటనపై.. డిమాండ్ చేస్తున్నారు.. అది వేరే విషయం.

కేంద్రంలో మోడీ చేస్తున్న వ్యవస్థల వినాశనం గురించి.. ఎప్పుడూ ఓ కథనం రాసే ప్రయత్నం చేయని.. జగన్ మీడియా.. ఇప్పుడు బీజేపీపై.. చంద్రబాబు దాడిపై మాత్రం.. తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఎదురు దాడి చేయడం ప్రారంభించింది. బీజేపీ కోసం వైసీపీ పడుతున్న ఆరాటం.. ఈ కథనంలో కనిపించిందన్న అంచనాలు ఉన్నాయి. పూర్తిగా రాజకీయ పార్టీగా… ఎదురు దాడి చేయాల్సిన అంశాన్ని.. అరకొర సమాచారం.. అంతకు మించిన అవగాహనా లేమితో.. వ్యవస్థల పేరుతో.. రాసిన కథనం… మీడియా వర్గాలనే.. కాదు.. కాస్త అవగాహన ఉన్న వారిని కూడా విస్మయపరిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.