సాక్షి” మూడో బ్లాక్ పేపర్ : ఆరోపణలే తప్ప “గారడీ” ఏమిటో చెప్పలేకపోయారా..?

ప్రతిపక్ష పార్టీల పని ఆరోపణలు చేయడం. ఆ ఆరోపణలకు.. చేసే నేత స్థాయిని బట్టి విలువ ఉంటుంది. కానీ… ఆ పని ఆయా పార్టీలకు ఆస్థాన పత్రికలు చేస్తే మాత్రం… ఆషామాషీగా కాకుండా.. అంకెలు, ఆధారాలతో సహా విడమర్చి చెబితేనే విలువ ఉంటుంది. లేకపోతే.. ప్రజలు కూడా… చెప్పడానికి వీళ్ల దగ్గర ఏమీ లేదు.. అందుకే.. ఊరకనే పైపైన ఆరోపణలు చేసి.. దాన్ని తమ పత్రికలో అచ్చేసుకుంటున్నారనుకునే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన మూడో శ్వేతపత్రంపై… సాక్షి దినపత్రికలో… ” అంకెల గారడి.. అదే సంక్షేమం” పేరుతో ఓ ఎడిటోరియల్ పేజీ ఆర్టికల్ ప్రచురించారు. అందులో.. ఎక్కడా… ప్రభుత్వం అంకెల గారడీ చేసిందని.. అంకెల్నీ బయటపెట్టలేకపోయారు.

కార్పొరేషన్‌లు, ఫెడరేషన్‌ల రుణమేళాల గురించి..ఎంత మందికి పెండింగ్‌లో ఉన్నాయో.. ఎంత ఇవ్వాలని లక్ష్యాలుగా పెట్టుకున్నారో చెప్పుకొచ్చారు కానీ.. ఓ పదిశాతం ఇచ్చి ఉంటారని లెక్క వేశారు. ఎంత మందికి ఇవ్వాలనే లెక్కలు తెలిసిన సాక్షికి… ఎంత మొత్తం ఇచ్చారో కూడా తెలిసే ఉంటుంది కదా..!చెప్పడానికి ఎందుకు సంశయించింది. ఇక సంక్షేమ హాస్టర్ల వ్యవహాంలోనూ అదే తీరు. గురుకుల హాస్టళ్లను ప్రారంభించారని.. చెప్పుకొచ్చారు కానీ.. మళ్లీ అక్కడ.. అక్కడ కనీస వసతులు లేవనే ఆరోపణలు. నిరుద్యోగ భృతిపైనా..అదే తరహా విమర్శలు చేశారు. 3 లక్షల మందికి భృతి ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబు తున్నది. ఇస్తున్నది మాత్రం 1.70 లక్షల మందికేనని నిరుద్యోగులు చెబుతున్నారట. మరి అంత పక్కాగా లెక్కలేసే నిరుద్యోగులు సాక్షిలో ఉన్నారేమో..? ఇతర వర్గాలకు అందిస్తున్న పథకాలు అన్నీ పాతవేనని.. కొత్త పేర్లు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు కానీ.. ఏ పథకాలైనా.. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమమా కాదా అన్నది ముఖ్యం. సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్ దీన్ని గుర్తించలేకపోయారు.

ఆదరణ పథకం లబ్దిదారులు.. వాటి వల్ల తమకు ఉపయోగం లేదని చెబుతున్నారని కూడా రాసుకొచ్చారు. వారు ధరఖాస్తు పెట్టుకుని మరీ తీసుకుని.. సాక్షికి మాత్రమే తమకు వాటి వల్ల ఉపయోగం లేదని చెబుతారా..?. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పైనా సమాచారం సేకరించే ఓపిక లేక.. పైపైన విమర్శలు చేసేశారు. ప్రతీ విషయంలోనూ… వివరాలు అధికారుల దగ్గర లేవు.. అని సదరు ఆర్టికల్ రాసిన రచయిత రాసుకొచ్చారు కానీ… అసలు తెలుసుకునే ఓపిక లేక.. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ సంక్షేమ పథకాన్ని విమర్శించడం కోసమే.. రాసుకున్నట్లుగా.. ఎలాంటి ప్రాతిపదికలు లేకుండా… బ్లాక్ పేపర్‌లను ప్రచురించేస్తున్నారు. వ్యాసం మొత్తంలో.. అసలు చంద్రబాబు సంక్షేమ రంగంలో ఏమీ చేయలేదని సాక్ష్యాలతో చెప్పడాన్ని మానేసి.. ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారని… ఫీలైపోడవమే ఎక్కువగా ఉది. సాక్షి ఎడిటోరియల్ ప్రమాణాలు ఇంతే అనుకోవడం తప్ప… మరేమీ చేయలేని పరిస్థితి పాఠకులది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close