`యాత్ర‌` సాక్షిగా బ‌య‌ట‌ప‌డ్డ భజన

సినిమాను సినిమాగా చూడాలి. రాజకీయాలను రాజకీయాలుగా చూడాలి. సాక్షి యాజమాన్యం అలా చేయడం లేదు. గత కొంతకాలంగా సినిమాలకు, రాజకీయాలకు ముడి పెడుతుంది. రాజకీయ ప్రత్యర్ధులకు సంబంధించిన సినీ వార్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. బాలకృష్ణ వార్తలను పేజీలో కింద ప్రచురిస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో జరిగితే.. చిన్న ఫొటో రైటప్ పెట్టి వదిలేశారు. పవన్ కళ్యాణ్ పేరు, ఫొటో సినిమా పేజీలో కనిపించవు. వైయస్సార్ పాదయాత్ర సినిమాకు ఫుల్ కవరేజీ ఇస్తుంది. `యాత్ర‌` సాక్షిగా మ‌రోసారి వైయ‌స్సార్‌ భజన బయటపడింది.

`యాత్ర‌`ను నిల‌బెట్టే బాధ్య‌త‌ సాక్షి పత్రిక భుజాన వేసుకుంది. విడుదలకు వారం ముందు నుంచి `యాత్ర‌`పై ప్రత్యేక కథనాలు వండి వారిస్తున్న సాక్షి, శనివారం సినిమా పేజీలో రివ్యూ రాసింది. వైయస్సార్ పేరుకు `మహానేత` పదాన్ని ఎప్పుడో పర్యాయ పదంగా మార్చింది సాక్షి. రివ్యూలోనూ వైయ‌స్సార్‌ను మహానేతగా సంభోదించడం పాఠకులకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ, మహాయోధుడిగా వర్ణించడం అతిశయోక్తిగా అనిపించింది. `ఎంత ఖ‌ర్చ‌యినా ప‌ర్వాలేదు ఓ మ‌హాయోధుడిని స‌మాజానికి చూపించాల‌నే ఆకాంక్ష నిర్మాత‌లు విజ‌య్‌, శ‌శిల‌ది` ఇదీ రివ్యూ చివర్లో వచ్చే లైన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రేమించని వాళ్ళు, తెలియనివాళ్ళు లేరనే చెప్పాలి అని సాక్షి రివ్యూలో ప్రకటించారు. `యాత్ర‌` సినిమాలో కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులకు వైయ‌స్ అంటే ప‌డ‌ద‌ని చూపించారు. వాళ్ళు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లేరా? వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాలకు వాళ్ళను పంపేశారా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో?

“యాత్ర‌ ఒక మనిషిది కాదు.. ఒక మహానుభావుడిది కాదు.. యాత్ర‌ ఒక సమాజానిది“ రివ్యూలో మరో లైన్ ఇది. వైయస్ పాదయాత్ర సమాజ పాదయాత్ర ఎలా అవుతుంది? ఆ ముక్క కూడా చెబితే బావుండేది. వైయస్ జగన్ పాదయాత్ర విజయవంతంగా ముగించుకుని ప్రజాభిమానాన్ని చూరగొన్నారని రాశారు. జగన్ పాదయాత్రకు, సినిమాకు సంబంధం ఏమిటో? రివ్యూలో మరీ ఇంత భజన చేయాలా అని ప్రజలు విస్తుపోయేలా సాక్షి భజన శృతిమించింది. ఇతర పత్రికలను విమర్శించే ముందు సొంత పత్రిక విలువలపై వైయస్ జగన్ ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close