జగన్ పర్యటన వర్సెస్ పవన్ పర్యటన, సాక్షి గురివింద నైజం

పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ రావలసిందిగా బీజేపీ నేతలు ఆహ్వానించగా ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజేపి అగ్ర నాయకత్వం తో చర్చించి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ అంతటినీ సాక్షి కవర్ చేసిన తీరు పాఠకులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సాక్షి ఈ ఎపిసోడ్ ని కవర్ చేసిన తీరు గురివింద గింజ సామెతను గుర్తు చేస్తోంది అని కొందరు అంటే, సాక్షి తీరుని గురివింద తో పోలిస్తే గురివింద కూడా ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే…

ఢిల్లీలో పవన్ పడిగాపులు అంటూ సాక్షి స్క్రోలింగ్ మరియు వార్తలు:

బీజేపీ పెద్దలు ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ ఒక రోజు ముందుగా ఢిల్లీ చేరుకున్నారు. ఒక రోజు గ్యాప్ ఉందని వారికి ముందే తెలుసు. అయితే విషయం తెలిసి కూడా, దీన్ని ఆయుధంగా మలచుకోవాలి అనుకుంది సాక్షి. వెంటనే సాక్షి లో – “ఢిల్లీలో పవన్ ఎదురుచూపులు. బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు పవన్ ‌కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కూడా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. నిన్ననే ఢిల్లీ చేరుకున్న పవన్, నాదెండ్ల మనోహర్ బీజేపీ అగ్రనాయకులతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారు.” అంటూ వార్తలు ఇచ్చింది సాక్షి. ట్విట్టర్ లో వచ్చిన ఇదే కంటెంట్ సాక్షి ఛానల్ లో కూడా పలుమార్లు స్క్రోలింగ్ అయింది.

అయితే ముందుగా నిర్ణయించుకున్న మేరకు మరుసటి రోజు బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అయితే వారు భేటీ అయ్యారు అని తెలియగానే, తమ నిన్నటి వార్త కు కొనసాగింపుగా మరో తరహా వార్త ఇచ్చింది సాక్షి – “ఫలించిన పవన్‌ ఆశలు.. ఎట్టకేలకు నడ్డాతో భేటీ.
న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎదురు చూపులు ఫలించాయి. బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు నవంబర్‌‌ 23న ఢిల్లీ వెళ్లిన పవన్‌ ఎట్టకేలకు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.”

అపాయింట్మెంట్ కోరడానికి , ఇన్విటేషన్ కు తేడా తెలియని సాక్షి అంటూ సోషల్ మీడియా విమర్శలు:

అయితే జగన్ తుమ్మితే వ్యూహాత్మకంగా తుమ్మాడు అని , దగ్గితే ప్రజా సంక్షేమం కోసం దగ్గాడు అని వార్తలు రాసే సాక్షి, ఇతర పార్టీల నాయకుల విషయంలో, వారి ఇమేజ్ డామేజ్ చేయడం కోసం వాస్తవాలను వక్రీకరించడానికి సైతం ఎంత మాత్రం వెనుకాడదని పలువురు విమర్శిస్తున్నారు. బిజెపి అధినేత జేపీ నడ్డా ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ను చర్చల కోసం తానే స్వయంగా ఆహ్వానించానని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసి కూడా సాక్షి, పవన్ కళ్యాణే అపాయింట్మెంట్ కోరుతున్నాడని, కానీ బిజెపి పెద్దలు ఇవ్వడం లేదని అర్థం వచ్చేలా, ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం ఈ వార్తలు రాసిందని
పవన్ అభిమానులతో పాటు తటస్థ పాఠకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

జేపీ నడ్డా ట్వీట్:
Invited Jana Sena Party chief @PawanKalyan ji for discussing the upcoming by-election poll and developmental issue of Andhra Pradesh.

గతంలో పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అపాయింట్మెంట్ దొరక్క ఖాళీ చేతులతో వెనక్కి తిరిగి వచ్చిన జగన్:

ఇతర పార్టీల నాయకులు ఢిల్లీ వెళ్లి కేంద్ర అగ్రనాయకత్వం తో చర్చలు జరిపి వెనక్కు తిరిగి వచ్చినా కూడా ఏదో రకంగా వారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ప్రయత్నించే సాక్షి, తమ పార్టీ నాయకుడు జగన్ ఢిల్లీ వెళ్లి, రెండు మూడు రోజుల పాటు అక్కడే తిష్టవేసి బిజెపి పెద్దల అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి, మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నా కూడా అపాయింట్మెంట్ దొరక్క వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలలో మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తుంది అని, ఇది సాక్షి గురివింద నైజానికి నిదర్శనం అని తటస్థ పాఠకులు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి సాక్షి పత్రిక, తాను వైఎస్సార్ సీపీ కరపత్రిక మాత్రమేనని మరొకసారి నిరూపించుకుందని, తమ బాస్ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించడం ద్వారా జర్నలిజం విలువలను తుంగలో తొక్కడానికి ఎంతమాత్రం వెనుకాడధని మరొకసారి అర్థమైంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను సాక్షి పట్టించుకుంటుందా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార‌త్ సేనకు అద్భుతం.. టెస్ట్ సిరీస్ కైవ‌సం

టెస్టు సిరీస్ విజ‌యం, అందులోనూ ప‌రాయి గ‌డ్డ‌పై, అదీ.. ఆసీన్ లాంటి బ‌ల‌మైన జ‌ట్టుపై - ఏ జ‌ట్టుకైనా ఇంత‌కంటే గొప్ప కల ఏముంటుంది? ఆ క‌ల‌ని నిజం చేసింది భార‌త...

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేత..!

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అక్రమంగా ప్రభుత్వం కక్ష సాధింపు కోసమే కేసులు పెట్టిందని.. ఆ కేసులు చెల్లవని వాదిస్తూ...

గోపీచంద్ – బాల‌య్య‌.. ఫిక్స్

క్రాక్ తో.. ట్రాక్ లోకి వ‌చ్చేశాడు గోపీచంద్ మ‌లినేని. ఈ సంక్రాంతికి అదే బిగ్గెస్ట్ హిట్. రెగ్యుల‌ర్ క‌థే అయినా.. క‌థ‌నంలో చేసిన మ్యాజిక్‌, ర‌వితేజ హీరోయిజం, శ్రుతి హాస‌న్ పాత్ర‌ని వాడుకున్న...

బెంగాల్‌లో దీదీ తృణమూల్ వర్సెస్ బీజేపీ తృణమూల్..!

భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు నేతలంతా... ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారు.. సిద్ధాంతాలను నేర్చుకున్నవారే్ అయి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీల్లో నేతలందర్నీ గుంపగుత్తగా చేర్చుకుని బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close