హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన..! ఇరుక్కుపోయిన తెలంగాణ అధికారి..!

హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదని భావించిన ధర్మాసనం.. తెలంగాణ హెల్త్ డైరక్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కరోనా విషయంలో తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని .. అనేక సార్లు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో..రోజుకు 50 వేల కరోనా టెస్ట్‌లు చేయాలని ఆదేశించింది. అయితే తెలంగాణ హెల్త్ డైరక్టర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరి కదా.. తాజా విచారణలో అవసరం ఉన్నప్పుడు రోజుకు 50 వేల టెస్టులు చేస్తామని చెప్పుకొచ్చింది.

దీనిపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదని వ్యాఖ్యానించింది. అందుకే హెల్త్ డైరక్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ఫలితాలేమో కానీ.. ఎన్నికల తర్వాత కరోనా రెండో దశ ఫలితాలు వస్తాయని.. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం కాలేదని ఆక్షేపించింది. కరోనా విషయంలో ప్రభుత్వ తీరుపై.. హైకోర్టు మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. కరోనా ఉద్ధృతంగా ఉన్నప్పటి నుంచి టెస్టులు అత్యధికంగా చేయాలని ఒత్తిడి చేస్తూనే ఉంది.

కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ తీరుపై వరుసగా పిటిషన్లు దాఖలవుతూ వచ్చాయి. వాటిపై విచారణలో .. హైకోర్టు హెచ్చరిస్తూనే ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. రాజకీయ నాయకులు బాధ్యులు కారు. అధికారులే బాధ్యులవుతారు. అందుకే.. హైకోర్టు హెల్త్ డైరక్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close