కాపు ఇష్యూ..! డ్యామేజ్ కంట్రోల్‌ కోసం దిగజారిపోతున్న సాక్షి..!!

బావగారూ బాగున్నారా అనే సినిమాలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ఎప్పుడూ తనతో పోల్చుకుని… కుమారుడ్ని ఓదారుస్తూ ఉంటుంది. అతని చేతకాని తనాన్ని అడ్డగోలుగా సమర్థిస్తూ ఉంటుంది. ఇప్పుడు సాక్షి కూడా అచ్చంగా అదే ప్రయత్నం చేస్తోంది. కాపు ఇష్యూలో అనుకోకుండా అన్నారో… కావాలని చేశారో కానీ… తప్పు దిద్దుకోలేని వ్యాఖ్యలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల వల్ల రాజకీయంగా వైసీపీకి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత సాక్షి పత్రికపై పడింది. దాన్ని ఆ పత్రిక భిన్నమైన కోణంలో ఆవిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి నిజమే చెప్పారని సమర్థించుకోలేని దుస్థితి. అలాగని… ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఇదీ అని విశ్లేషించలేని పరిస్థితి. అందుకే… ఈ ఎపిసోడ్ మొత్తంలో .. కోటశ్రీనివాసరావు క్యారెక్టర్‌ను అడాప్ట్ చేసుకున్నారు సాక్షి ఎడిటోరియల్ సిబ్బంది. చంద్రబాబు కాపులకు చేసిన అన్యాయం కన్నా.. జగన్ చెప్పిన మాటలు పెద్ద మోసమే కాదన్ననట్లుగా కథనాలు వడ్డించేస్తున్నారు.

సాక్షి దినపత్రికలో గత మూడు నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. ఈ రోజు కూడా ఓ కథనాన్ని ప్రచురించారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుది మొదటి నుంచి మోసపూరిత వైఖరేనని చెప్పడం ఆ కథనం ఉద్దేశం. చరిత్ర అంతా రాసుకొచ్చి… చివరికి ఒకే మాట ఉన్నది .. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డినేనని.. ప్రత్యేకమైన …కలర్ కోటింగ్ వార్త రాసుకొచ్చారు. చంద్రబాబు కాపు రిజర్వేషన్ల విషయం ఏం చేశారో.. ఏపీ మొత్తం చూసింది.. చూస్తూనే ఉంది. అందులో లోపాలు వెదికి.. మిమ్మిల్ని చంద్రబాబు ఇలా మోసం చేశారు.. కానీ జగన్ మాత్రం.. మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నారు. మొన్న ప్రసంగంలోని మాటలకు అర్థం అది కాదని… పాఠకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు చేసిన దాంతో పోలిస్తే.. జగన్ అన్న మాటలు పెద్ద లెక్క కాదని తేల్చారు.

జగ్గంపేటలో జగన్ చేసిన ప్రకటన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతగా ఆందోళనకు గురి చేస్తోందో.. సాక్షి పత్రికలో వస్తున్న కథనాలే నిరూపిస్తున్నాయి. కంగారు పడిపోయి.. ఏదో ఒకటి చేసి డ్యామేజ్ కంట్రోల్ చేద్దామన్న ఆలోచన మాత్రమే సాక్షి పత్రికలో కనిపిస్తోంది. కానీ గ్రౌండ్ రియాల్టీని మాత్రం పాఠకుల ముందు ఉంచలేకపోతోంది. వైసీపీ సానుభూతి పరులకు కూడా… రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలుసు. చంద్రబాబు ఏం చేస్తున్నారో.. జగన్ ఏం చేశారో కూడా తెలుసు . ఇప్పుడేదో.. జగన్ వ్యూహం దెబ్బకొట్టిందని… దాన్ని ఎలాగోలా కవర్ చేసి.. చంద్రబాబుతో సమానం చేయాలనుకోవడానికి తాపత్రయ పడటం సాక్షిపత్రికకు ఎబ్బెట్టుగా మారింది. పాఠకులకు కూడా చిరాకు తెప్పించేలా వ్యవహారం మారిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close