ఈ తరం హీరోయిన్స్ అందరిలోకి సమంతా సంథింగ్ స్పెషల్ అని చెప్పడానికి డౌట్స్ అవసరం లేదు. సమంతాతో కలిసి ఒకసారి వర్క్ చేసిన డైరెక్టర్స్‌తో పాటు హీరోలు కూడా మళ్ళీ మళ్ళీ ఆమెతో కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నేనొక్కడినే సినిమా విషయంలో సమంతా చేసిన రచ్చకు హర్టయిన మహేష్ బాబు కూడా మరోసారి తన పక్కన నటించే అవకాశం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్‌తో కూడా సమంతాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే తను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరితోనూ మంచి రిలేషన్సే ఉన్నాయి.
ఏమాయ చేశావే సినిమాతో యువ హృదయాలకు గిలిగింతలు పెట్టిన సమంతా, మనం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని లుక్స్ మెయింటైన్ చేస్తున్న నాగార్జునకు తల్లిగా నటించి ప్రేక్షకులను మెప్పించడమంటే మాటలు కాదు. ఏ కొంచెం తేడా వచ్చినా మొత్తం సినిమానే అభాసుపాలయ్యే అవకాశమున్న పాత్రలో సమంతా నటన అద్భుతంగా ఉంటుంది. అయితే మొదటి నుంచి కూడా సమంతాకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలే పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి సినిమాలలో ఎక్కువ శాతం హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. కానీ సమంతాకు మాత్రం నాటు రకం మాస్ మసాలా హీరోయిన్గా కూడా సక్సెస్ అవ్వాలని ఎక్కడో ఆశ ఉన్నట్టుంది. అందుకే సికిందర్ సినిమాలో ఊరమాస్ లుక్‌లో కనిపించింది. బికినీ కూడా వేసేసింది. ఇప్పుడు జనతా గ్యారేజ్‌లో మరోసారి రెచ్చిపోయింది. ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరిలోనూ ఓ కామెన్ క్వాలిటీ ఉంటుంది. తమ లోపాలు తాము గుర్తెరగడం. అర్జెంట్‌గా సమంతా కూడా ఈ విషయం రియలైజ్ అవ్వాలి. తనను తాను రిపేర్ చేసుకోవాలి. సమంతాకు స్కిన్ షో, మసాలా హీరోయిన్ క్యారెక్టర్స్ సూట్ అవ్వవు అన్నది వాస్తవం. కరెక్ట్‌గా చెప్పాలంటే స్కిన్ షో కంటే కూడా సమంతా యాక్టింగ్ చాలా చాలా బాగుంటుంది. అందుకే అలాంటి చెత్త ప్రయత్నాలు మానేసి నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్, కథలు సెలక్ట్ చేసుకుంటే ఇంకొంత కాలం పాటు హీరోయిన్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ తరపున చాలా చాలా హెల్పింగ్ యాక్టివిటీస్ చేస్తున్న సమంతా త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిత్వంతో కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది సమంతా. ఆ ఇమేజ్‌ని జీవితాంతం కాపాడుకోవాలనుకుంటే కూడా ఎక్స్పోజింగ్ విషషయంలో కొన్ని లిమిట్స్‌లో ఉండడం సమంతాకు చాలా చాలా ‘మంచిది’.