నాగచైతన్యతో విడిపోయిన తరవాత మరింత స్ట్రాంగ్ వుమెన్ గా రూపాంతరం చెందుతూ వచ్చింది సమంత. చాలాసార్లు, చాలా విషయాల్ని చాలా లోతుగానే మాట్లాడింది. మానసికంగా తానెంత దృఢంగా ఉంటుందో చెప్పకనే చెప్పింది. చైతూతో విడాకుల తరవాత సమంత సింగిల్ గానే ఉంటుంది. చైతూ మాత్రం శోభితని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేశాడు. చైతూ పెళ్లయ్యాక.. ‘మరి సమంత ఎప్పుడు చేసుకొంటుంది’ అనే ప్రశ్న మరింత గట్టిగా వినిపించసాగింది. సమంత కూడా రెండో పెళ్లికి ‘నో’ అని ఎక్కడా చెప్పలేదు. అలాగని ‘చేసుకొంటున్నా’ అని కూడా అనలేదు. కాకపోతే కొన్ని హింట్స్ అలా.. అలా వదులుతూ వస్తోంది.
దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత క్లోజ్ గా ఉంటుందన్న వార్తలు ఇప్పటివి కావు. వీరిద్దరూ చాలాసార్లు జంటగా కనిపించారు. వీరిద్దరి మధ్య ఏదో సాగుతోందన్న గుసగుసలు బలంగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత రాజ్ ఇంట్లో దీపావళి చేసుకొంది. రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకొంది. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచకుండా, ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో వదిలింది. దాంతో మరోసారి వీరిద్దరి గురించి నెటిజన్లు ఆసక్తిగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇవన్నీ సమంత కావాలని ఇస్తున్న లీకుల్లా అనిపిస్తున్నాయి. సడన్గా వ్యవహారం బయట పెట్టకుండా, మెల్లమెల్లగా తన అభిమానుల్ని సమంత ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తూనే వుంది.
అయితే సమంత ఏదీ దాచుకోదు. ధైర్యంగానే బయటపెట్టేస్తోంది. రాజ్ తో అనుబంధం బలపడి, పెళ్లి చేసుకోవాలని ఉందంటే తాను కచ్చితంగా చెప్పేస్తుంది. కాకపోతే అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తోందేమో. అందుకే.. ఇలా మెల్లమెల్లగా లీకులు ఇచ్చుకొంటూ వెళ్తోందేమో? ఏదేమైనా సమంత వ్యవహారం మరోసారి దీపావళి సందర్భంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడైనా సమంత స్పందిస్తుందేమో చూడాలి.