స‌మంత డామినేష‌న్ మొద‌లైపోయిందా?

త్రివిక్రమ్ – సమంత‌ల మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తోంది.. అని ఎప్ప‌టి నుంచో టాలీవుడ్ కోడై కూస్తోంది. త్రివిక్ర‌మ్ కూడా ‘సమంత లేకుండా నేను సినిమానే తీయ‌లేను’ అన్న‌ట్టు బిహేవ్ చేస్తుండ‌డం కూడా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాల్లో స‌మంత‌నే క‌థానాయిక‌. ఇప్పుడు అ.ఆలో ఈ కాంబినేష‌న్ రిపీట్ అవుతోంది. తెర‌పై హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ కంటే.. సెట్లో స‌మంత‌, త్రివిక్ర‌మ్‌ల కెమిస్ట్రీగానే బాగా వ‌ర్కవుట్ అయ్యిందన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దానికి త‌గ్గ‌ట్టే స‌మంత క్యారెక్ట‌ర్‌కి ఈ సినిమా ఇంపార్టెన్స్ బాగా పెంచేశాడ‌ట త్రివిక్ర‌మ్‌. నితిన్ క్యారెక్ట‌ర్‌ని స‌మంత పూర్తిగా డామినేట్ చేసేసింద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అ.ఆ టీజ‌ర్ కూడా దాన్ని రుజువు చేస్తోంది. సమంత ఎంట్రీతో మొద‌లైన ఈ టీజ‌ర్‌లో… దాదాపుగా ప్ర‌తీ ఫ్రేమ‌లోనూ ఆమే క‌నిపించింది. స‌మంత డైలాగ్‌తోనే టీజ‌ర్ ఎండ్ అయ్యింది. సాధార‌ణంగా టీజ‌ర్ అంటే.. హీరో ఓ ప‌వ‌ర్ ఫుల్ డైలాగో, పంచో వ‌దులుతాడు. కానీ.. రొటీన్‌కి భిన్నంగా త్రివిక్ర‌మ్ ఆలోచించాడ‌న్న‌మాట‌. అయితే… స‌మంత – త్రివిక్ర‌మ్‌ల గురించి తెలిసిన‌వాళ్లంతా, ఇదంతా స‌మంత‌పై త్రివిక్ర‌మ్ కి ఉన్న ప్రేమ అంటున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంతో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com