చైతూతో సమంత పెళ్లి జరుగుతుందా?? అనే ప్రశ్న ఇప్పుడు పాతదై పోయి, ఎప్పుడో పక్కకెళ్లిపోయింది. ఎందుకంటే వీళ్లిద్దరి పెళ్లికీ నాగార్జున పచ్చజెండా ఊపేయడంతో.. లైన్‌క్లియర్ అయిపోయింది. ముందు నాగ్, ఆ తరవాత చైతూ ఒకొక్కరుగా తమ మనసులోని మాట బయటకు చెప్పేసి ఈ సస్పెన్స్‌కు తెర దించారు. అప్పట్నుంచి సమంత – చైతూల పెళ్లెప్పుడు? అనే ప్రశ్న మొదలైంది. వచ్చే యేడాదంటూ నాగ్ క్లారిటీ ఇచ్చేయడంతో దానికీ సమాధానం దొరికేసింది. ఇక పెళ్లయ్యాక సమంత సినిమాల్లో నటిస్తుందా, లేదా?? అంటూ మరో సందేహం మొదలైంది. పెళ్లయ్యాక సమంత సినిమాల్ని మానేస్తుందని కొందరు, లేదు కొనసాగుతుందని ఇంకొందరు, అదేం కాదు మెల్లిమెల్లిగా తగ్గించుకొంటుందంటూ మధ్యస్తంగా మరికొందరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
అయితే తాజాగా సమంత పై చేసిన ఓ హాట్ ఫొటో షూట్ సమంత ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పేసినట్టైంది. సౌత్ స్కోప్ పత్రిక కోసం సమంత హాట్ హాట్ పోజులిచ్చింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో షికారు చేస్తోంది. ఈ ఫొటో షూట్ ఉద్దేశం.. తాను సినిమాల్లో కొనసాగుతా అని చెప్పడమే అని తెలుస్తోంది. సాధారణంగా ఫామ్ కోల్పోయినప్పుడు అవకాశాల కోసమో, లేదంటే స్టార్ డమ్‌లో ఉన్నప్పుడు ఆ కిక్లోనో ఇలాంటి ఫొటో షూట్లకు ఒప్పుకొంటారు కథానాయికలు. సమంతకు అవకాశాల కొదవ లేదు. కాకపోతే చైతూతో పెళ్లయ్యాక సమంత సినిమాలకు దూరం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. సమంతకూ అదే ఉద్దేశం ఉంటే.. ఇలాంటి ఫొటో షూట్లకు ఎందుకు ఒప్పుకొంటుంది?? సమంతకు వరుసగా అవకాశాలొస్తున్నా కావాలనే పక్కన పెడుతోందని, ఈ సినిమాలు తన పెళ్లికి అడ్డుకాకూడదని భావిస్తోందని తెలుస్తోంది. పెళ్లి ఎప్పుడు అనే విషయంలో సమంతకు ఓ క్లారిటీ వచ్చేస్తే గనుక… అప్పుడు దాన్ని బట్టి డేట్లు అడ్జస్ట్ చేసి సినిమాల్ని ఒప్పుకోవచ్చని భావిస్తోందట. నేనింకా రేసులోనే ఉన్నా అని చెప్పడానికే సమంత ఈ ఫొటో షూట్ నిర్వహించిందన్నమాట. తెలివైందే.. ఒక్క ఫొటో షూట్‌తో అందరి నోళ్లూ మూయించింది.
Photo Credit : South Scope