నమ్మినోళ్లు మోసం చేయడం ఈ పాయింట్.. సినిమాల్లోనే కాదు, బయటా ఎక్కువగా కనిపిస్తుంటాయి. సినిమా వాళ్ల విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటాయ్. కథానాయిక సమంత విషయంలో అదే జరిగింది. ఆమెను నమ్ముకొన్న వాళ్లే మోసం చేశారు. అయితే సమంత చూస్తూ కూర్చోలేదు. అంతకంత బదులు చెప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ప్రతీ కథానాయికకూ ఓ టీమ్ ఉంటుంది. నలుగురైదుగురు టీమ్ తో ఓ వ్యక్తిగత సిబ్బంది ఉంటుంది. సమంతకీ ఉంది. మేకప్‌మెన్, డ్రైవర్, పర్సనల్ అసిస్టెంట్ ఇలా సమంత బ్యాచ్‌లో ఐదుగురు ఉంటారు. ఈమధ్య వాళ్లందరినీ ఒక్కసారిగా మార్చేసింది సమంత. ఆ స్థానంలో ముంబై నుంచి కొంతమందిని పిలిపించి.. నియమించింది. దానికి కారణం.. ఈమధ్య సమంత డైమండ్ రింగ్ పోయింది. చాలా ఖరీదైన రింగ్ అది. పైగా సెంటిమెంట్ కూడా. సమంత చేతికి ఎప్పుడూ ఉంటుంది. షూటింగ్‌కి వెళ్లే ముందు కార్ వ్యాన్‌లో ఆ ఉంగరం ఉంచి.. మళ్లీ వచ్చాక వేలికి తొడుగుతుంది. అలాంటి ఉంగరం ఓసారి సడన్‌గా మాయమైంది. తన సిబ్బందిలోని ఎవరో ఒకరు దాన్ని కాచేసి ఉంటారన్నది సమంత గట్టి నమ్మకం. నిజానికి సమంత తన టీమ్‌ని చాలా బాగా చూసుకొనేది. షూటింగ్ ఉన్న రోజు బేటాలు నిర్మాతలో ఇప్పించేది. తాను అదనంగా కొంత మొత్తం ఇచ్చేది. జీత భత్యాల విషయంలో ఎప్పుడూ ఏ లోటూ చేయలేదు సమంత. పెళ్లిళ్లూ, పేరంటాలూ ఉంటే అడక్కుండానే లక్షలు ఇచ్చేసేదట. జీతంలో సంబంధం లేకుండా చాలాసార్లు.. ఆదుకొన్నదట. అందర్నీ తన మనుషులుగా భావించేదట. ఇంట్లో వాళ్ల సంగతులూ ఎప్పటికప్పుడు అడిగితెలుసుకొనేదట. ఇక బట్టలకైతే కొదవ లేకుండా చూసుకొనేదట. సమంత ఎప్పుడు షాపింగ్ చేసినా, తన టీమ్కీ ఏదోటి కొని తీసుకొచ్చేదట. ఇంతలా చూసుకొంటే… ఉంగరాన్ని కాజేయడం ఏమిటి? అందుకే సమంత మనస్థాపానికి గురైందని సమాచారం. వీళ్లనందరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ముందూ చాలా రకాలుగా ఆలోచించిందట. కానీ.. జరిగిన మోసానికి ఏం చేయాలో తెలీక, వాళ్ల మొహం మరోసారి చూడలేక ఒక్క డ్రైవర్ని మినహా మిగిలిన వాళ్లనందరికీ తొలగించిందని తెలుస్తోంది. పాపం.. సమంత ఉంగరం పోయిందనే బాధ కంటే… నమ్మినోళ్లు మోసం చేశారన్న బాధే దిగమింగుకోలేకపోయిందన్నమాట. సమంత ఎంత సెన్సిటివో అర్థమైందా??