‘నిన్ను కోరి’తో హిట్ కొట్టిన కొత్త దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథకు అక్కినేని నాగచైతన్య ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ప్రస్తుతం నానితో ‘కృష్ణార్జున యుద్ధం’ నిర్మిస్తున్న కొత్త నిర్మాతలు ‘షైన్ స్క్రీన్’ హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో నాగచైతన్య సరసన సమంత నటిస్తుందనే న్యూస్ వచ్చింది. పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నటించలేదు. అందుకని ఈ న్యూస్ అక్కినేని అభిమానులకు ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది. అసలు మేటర్ ఏంటంటే… సమంత ఇంకా సినిమాకి సంతకం చేయలేదట. కథ విన్న నాగచైతన్య అందులో ఒక రోల్ ముద్దుల శ్రీమతి సమంత చేస్తే బాగుంటుందని భావించాడట. అది గెస్ట్ రోల్కి ఎక్కువ, ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్కి తక్కువ అన్నట్టు వుంటుందని సమాచారమ్. సినిమాలోని క్యారెక్టర్స్ అన్నిటిలోనూ సమంత క్యారెక్టరే స్పెషల్గా వుంటుందట. నాగచైతన్య రికమండ్ చేయడంతో సమంత సినిమాకి సంతకం చేసినట్టే అని ఫిలింనగర్ టాక్.