స‌మంత ఓకే అనేసింది!

సింగీతం శ్రీ‌నివాస‌రావు చాలాకాలం త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నారు. అందులోనూ ఓ బ‌యోపిక్ తో. దేవ‌దాసి `బెంగ‌ళూరు నాగ‌ర‌త్త‌మ్మ‌` క‌థ‌ని ఆయ‌న తెర‌పై చూపించ‌బోతున్నారు. ఆ పాత్ర‌కు ఆయ‌న ముందున్న మొద‌టి ఆప్ష‌న్‌.. స‌మంత‌. ముందు స‌మంత‌కి ఈ క‌థ చెప్పి, త‌ను నో చెబితే అప్పుడు మిగిలిన ఆప్ష‌న్ల జోలికి వెళ్లాల‌ని భావించారు సింగీతం. స‌మంత‌తో ఇది వ‌ర‌కు ఒక‌ట్రెండు సార్లు సంప్ర‌దింపులు కూడా అయ్యాయి. కానీ.. స‌మంత నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. ఎట్టకేల‌కు ఈ ప్రాజెక్టుకు సమంత ఓకే చెప్పేసింద‌ని తెలుస్తోంది. జ‌న‌వ‌రి నుంచి ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కే ఛాన్సుంద‌ని స‌మాచారం. ఇది కాకుండా స‌మంత సోనీ ప్రొడ‌క్ష‌న్స్ లో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది. నవంబ‌రులోనే ఈ సినిమా మొద‌లు కానుంది. ఆ త‌ర‌వాత కొంత బ్రేక్ ఇచ్చి.. సింగీతం సినిమా సెట్స్‌లో పాల్గొంటుంది స‌మంత‌. ఈ బ‌యోపిక్ లో స‌మంత‌తో పాటు మ‌రి కొంత‌మంది స్టార్లు క‌నిపిస్తారు. వాళ్ల కోసం చిత్ర‌బృందం గ‌ట్టిగానే అన్వేషిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close