సమంత కోపంలో అర్ధముంది

సమంత-నాగచైతన్యల జంట కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఊహాగానాలు. ఇద్దరూ విడాకులకు అప్లయ్ చేశారని.. ప్రస్తుతం కౌన్సిలింగ్ స్టేజ్ లో విడాకులున్నాయని కథనాలు. అయితే ఇప్పటివరకూ దీనిపై ఎవరూ పెదవి విప్పలేదు. అటు మీడియా కూడ వీరి పబ్లిక్ ప్రజన్స్ కోసం ఎదురుచూస్తుంది. ”లవ్ స్టొరీ’ ప్రొమోషన్స్ నాగ చైతన్యకు ఖచ్చితంగా ‘విడాకుల” ప్రశ్న ఎదురురౌతుంది. ఐతే ఇంతలో సమంతకి ఈ రూమర్స్ తాకాయి. అదీ తిరుమల కొండపై. శనివారం విఐపీ బ్రేక్ ప్రారంభంలో శ్రీ‌వారిని స‌మంత ద‌ర్శించుకుంది. అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌ప‌లంలో వేద‌పండితుల ఆశీర్వచ‌నం తీసుకొని వస్తున్న క్రమంలో ఓ మీడియా ప్రతినిధి ”రూమర్స్ వస్తున్నాయి ?”అని నేరుగా కొండమీదే ప్రశ్నించాడు.

ఈ ప్రశ్న తనకు ఎదురౌతుందని సమంతకి తెలుసు. కానీ నేరుగా ఇలా కొండమీద శ్రీవారి సన్నిధిలో ఇలాంటి ప్రశ్న వేస్తారని సమంత ఊహించలేదు. అందుకే పట్టరాని కోపం వచ్చింది. ప్రశ్న అడిగిన వ్యక్తి వైపు కోపంగా చూసి ”గుడికి వచ్చి.. బుద్ధుందా?’అని చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమంత. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సమంతకి మద్దతు తెలుపుతున్నారు. శ్రీవారి సన్నిధి అనే కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పర్శనల్ ప్రశ్నలు వేయడం సదరు మీడియా వారికి తగదని కామెంట్స్ చేస్తున్నారు. సమంత కోపంలో అర్ధం వుంది.. పర్శనల్ మేటర్ లో మీడియా అతి పనికి రాదు.. రూమర్స్ పై క్లారిటీ తీసుకోవడానికి సమయం, సందర్భం వుంటుందని మరి కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత...

HOT NEWS

[X] Close
[X] Close