భార‌త క్రికెట్లో…. ‘కెప్టెన్సీ’ ఆట‌!

టీ 20 సార‌ధ్యాన్ని వ‌దులుకోవాల‌న్న కోహ్లి నిర్ణ‌యం సంచ‌ల‌న‌మైంది. మూడు ఫార్మెట్ల‌నీ కోహ్లీనే న‌డిపించ‌డం నిజంగానే ఒత్తిడితో కూడుకున్న విష‌యం. అందుకే ఈసారి టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ ముగిశాక‌… కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుని, ఆట‌గాడిగా కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. టెస్ట్, వ‌న్డే ప‌గ్గాలు కోహ్లీ చేతుల్లోనే ఉంటాయి. కోహ్లీ త‌ప్పుకుంటే ఆ స్థానం ఎవ‌రికి ద‌క్కాలి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కోహ్లి త‌ర‌వాత అంత‌టి స‌మ‌ర్థుడు, అనుభ‌వ‌జ్ఞుడు రోహిత్ శ‌ర్మ‌నే. కోహ్లి గైర్హాజ‌రీలో… ఎన్నోసార్లు జ‌ట్టుని ముందుండి న‌డిపించాడు. పైగా ఐపీఎల్ లో త‌న‌కి తిరుగులేని రికార్డ్ ఉంది. కోహ్లి నేతృత్వంలోని బెంగ‌ళూరు ఒక్క‌సారి కూడా ఐపీఎల్ క‌ప్పు గెల‌వ‌లేదు. రోహిత్ మాత్రం ఏకంగా త‌న జ‌ట్టుని ఐదుసార్లు గెలిపించాడు. ప్ర‌తీసారీ ముంబై హాట్ ఫేవ‌రెట్టే. కానీ బెంగ‌ళూరు ఎప్పుడు ఎలా ఆడేదో అర్థ‌మ‌య్యేది కాదు. మేటి ఆట‌గాళ్లు ఉన్నా బెంగ‌ళూరుకి ఒక్క‌సారి కూడా క‌ప్ అందించ‌లేద‌న్న వెలితి… కోహ్లీ కి ఉంది.

ఈ లెక్క‌న టీ 20 పగ్గాలు రోహిత్ కే అప్ప‌గించాలి. కానీ… రోహిత్ చిన్న‌వాడేం కాదు. త‌న వ‌య‌సు 34 ఏళ్లు. ఈ వ‌య‌సులో టీ 20 జ‌ట్టుని ఎలా న‌డిపిస్తాడు? ఇప్పుడు కావ‌ల్సింది యువ ర‌క్త‌మే. కాబ‌ట్టి… యువ ఆట‌గాళ్ల‌లో ఎవ‌రికో ఒకరికి టీ 20 ప‌గ్గాలు అప్ప‌గించాల‌న్న వాద‌న వినిపిస్తోంది. రాహుల్, పంత్ లాంటి వాళ్ల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌స్తున్నాయి. నిజానికి వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ ని ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని, యువ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోహ్లి బోర్డుని కోరిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఇది వ‌ర‌క‌టి నుంచీ కోహ్లీ- రోహిత్ మ‌ధ్య విబేధాలు ఉన్నాయ‌ని, అందుకే తాను వెళ్తూ వెళ్తూ.. రోహిత్ వైస్ కెప్టెన్సీకి ఎస‌రు పెట్టాల‌ని కోహ్లి నిర్ణ‌యించుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. రోహిత్ కి కూడా కెప్టెన్సీపై మోజు లేదు. అందుకే… తాను కూడా ఆస‌క్తి చూపించ‌క‌పోవొచ్చు. మ‌రి ఎప్పుడు ఎలా ఆడ‌తాడో తెలియ‌ని పంత్ కీ, అప్పుడ‌ప్పుడూ మెరిసే రాహుల్ ఈ స్థానానికి అర్హులా…? ఈ విష‌యం బోర్డే తేల్చాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత...

HOT NEWS

[X] Close
[X] Close