‘హ‌నుమాన్‌’.. అడ్వెంచ‌ర్ షురూ!

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. మూడు క‌థ‌లూ మూడు సెట‌ప్పులు. ఒక క‌థ‌కీ మ‌రో క‌థ‌కీ సంబంధ‌మే లేదు. ఇప్పుడు `హ‌ను – మేన్‌`ని రంగంలోకి దించుతున్నాడు. తేజ స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. హ‌నుమంతుగా తేజ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఓ టీజ‌ర్ వ‌దిలారు. `హ‌ను -మేన్‌` టైటిల్ బ‌య‌ట‌కు రాగానే ఇది సోషియో ఫాంట‌సీనా, పురాణ గాథా? అనే ఆస‌క్తి నెల‌కొంది. టీజ‌ర్‌తో ఆ ఆస‌క్తి మ‌రింత రెట్టింపు అయ్యింది. హ‌నుమంతుడి లా విన్యాసాలు చేస్తూ.. గాల్లో ఎగురుతూ, జింక‌ని వేటాడుతూ క‌థానాయ‌కుడి పాత్ర‌ని రివీల్ చేశారు. అతీంద్రియ శ‌క్తుల నేప‌థ్యంలో సాగే క‌థ అని అర్థం వుతోంది. హ‌నుమంతుడు చిరంజీవి… త‌ను ఇంకా బ‌తికే ఉన్నాడు, హిమాల‌యాల్లో త‌న ఆన‌వాళ్లు ఇంకా క‌నిపిస్తాయ‌ని కొంత‌మంది న‌మ్ముతారు. బ‌హుశా… ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్ప‌ద‌ల‌చుకున్న పాయింట్ కూడా అదే కావొచ్చు. భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల అవుతున్న తొలి సూప‌ర్ మేన్ సినిమా అంటూ.. ఘ‌నంగా ప్ర‌క‌టించుకుంది చిత్ర‌బృందం. ఈసినిమాని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత...

గంజాయి పట్టుకుంటున్న ఇతర రాష్ట్రాల పోలీసులు కుట్రదారులా !?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలే తేడాగా ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసుల్ని నమ్ముకుని అక్కడ డేటా చోరీ అంటూ అనేక రకాల కేసులు పెట్టించి ఏపీ అధికార పక్షాన్ని ఓ ఆట...

HOT NEWS

[X] Close
[X] Close