కొరియ‌న్ సినిమా రీమేక్‌లో స‌మంత‌

స‌మంత లేటెస్ట్ సినిమా.. యూట‌ర్న్‌. త‌న కెరీర్‌లో స‌మంత తొలిసారి ఓ రీమేక్ సినిమాలో న‌టించింది. అది ఆశించిన ఫ‌లితం రాలేదు. స‌మంత మ‌రోసారి రీమేక్ క‌థ‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. ప్ర‌స్తుతం నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంది స‌మంత‌. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టించే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇదో కొరియ‌న్ సినిమాకి రీమేక్‌. ఆ సినిమానే ‘మిస్ గ్రానీ’. ఓ నాయిన‌మ్మ‌- ఆమె మ‌న‌వ‌రాలు మ‌ధ్య న‌డిచే క‌థ ఇది. మ‌న‌వ‌రాలి పాత్ర‌లో స‌మంత క‌నిపిస్తుంది.చ నాయిన‌మ్మ పాత్ర‌లో ఎవ‌రిని ఎంచుకుంటారో చూడాలి. కొరియ‌న్ సినిమాని అఫీషియ‌ల్‌గా రీమేక్ చేస్తోంది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్. ఇందుకు సంబంధించి.. రైట్స్ కూడా అధికారికంగానే కొనుగోలు చేశారు. `క‌ల్యాణ వైభోగ‌మే` త‌ర‌వాత నందినిరెడ్డి ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. మ‌హిళా ద‌ర్శ‌కులంతా చెల్లాచెదురైపోతున్న ఈరోజుల్లో నందిని రెడ్డి నిల‌బ‌డాలంటే.. ఓ హిట్టు కొట్టాల్సిందే. మ‌రి ఈ కొరియ‌న్ రీమేక్ ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close