మైనింగ్ డాన్ రాజకీయ కోట కూలిపోయినట్లే..! బళ్లారి ఇక కాంగ్రెస్ దే..!!

కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్ధన్ రెడ్డి శకం దాదాపుగా ముగిసిపోయింది. ఆయన కంచుకోటగా మార్చుకున్న బళ్లారిలో ఇప్పుడు.. .బీజేపీ వైపు చూసే వారు కరవవుతున్నారు. అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేయకపోయినా గెలుస్తారని గొప్పగా చెప్పుకునే బళ్లారికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉగ్రప్ప… రెండున్నర లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి అని చెప్పుకున్నా.. బళ్లారి ఏరియాలో… జేడీఎస్ కు ఎలాంటి బలం లేదు. అక్కడ కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. లోక్ సభ నియోజకవర్గం మొత్తం మీద జేడీఎస్ కు 20 నుంచి 30 వేల ఓట్లు మాత్రమే వస్తూంటాయి. కానీ…గత లోక్ సభ ఎన్నికల్లో గాలి జనార్ధనరెడ్డి కుడి భుజం శ్రీరాములు సాధించిన మెజార్టీ 80వేలు. ఇప్పుడు అదంతా మైనస్ కాగా.. కాంగ్రెస్ పార్టీకి రెండున్నర లక్షల మెజార్టీ వచ్చింది.

బీజేపీ తరపున పోటీ చేసింది కూడా..శ్రీరాములు సోదరి శాంతనే. అయినా గెలిపించుకోలేకపోయారు. బళ్లారిలోకి అడుగు పెట్టేందుకు గాలి జనార్ధన్ రెడ్డికి అనుమతి లేదు. అయినా.. బళ్లారి జిల్లా శివారులో మకాం వేసి ఉపఎన్నికలను పర్యవేక్షించినా ప్రయోజనం లేకపోయింది. 2004 నుంచి బళ్లారి పార్లమెంట్ స్థానాన్ని శాసిస్తున్న బీజేపీ కంచుకోట బద్దలైపోయింది. నిజానికి గాలి వర్గం రాజకీయంగా ప్రభావం కోల్పోతోందని.. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయింది. బ‌ళ్లారి జిల్లాలో మొత్తం 9 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా 6 స్ధానాల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించింది. కేవలం మూడు చోట్ల మాత్రమే.. గాలి వర్గీయులు విజయం సాధించగలిగారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు ప్రయత్నించారు. ఆ ఆడియో టేపులు కూడా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది.అవన్నీ కలిసి ఇప్పుడు.. గాలి వర్గీయుల రాజకీయంపై కర్ణాటక ప్రజలకు విరక్తి తెప్పించిటన్లయింది. రాజకీయంగా పట్టు లేకపోతే… బీజేపీ కూడా.. గాలి వర్గాన్ని ఏ మాత్రం భరించే అవకాశం ఉండదు.ఇక వారికి బీజేపీలోనూ ప్రాధాన్యం దక్కడం కష్టమే కావొచ్చని కర్ణాటక రాజకీయవర్గాల అంచనా. అంటే.. ఓ రకంగా గాలి వర్గం రాజకీయంగా అంతిమ దశకు చేరుకున్నట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close