“సమీరా” వీడియో నాగబాబు చూడలేదా..?

తాను లేకపోతే జబర్దస్త్ లేదని.. దాని అంతం చూస్తానని.. జీ టీవీకి వెళ్లిపోయిన నాగేంద్రబాబు.. తన క్రియేటివిటి అంతా జోడించి.. అదిరింది అనే షో చేశారు. కానీ ఆ షో అదరలేదు. ఆ షోకి క్రేజ్ రావడం కోసం.. నాగబాబు.. తన యూ ట్యూబ్ చానల్‌లో… చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ ప్రోగ్రాం ప్రొడ్యూస్ చేస్తున్న మల్లెమాల ఎంటర్‌టెయిన్‌మెంట్స్ దగ్గర్నుంచి ప్రసారం చేస్తున్న ఈటీవీ వరకూ దేన్నీ వదిలి పెట్టలేదు. తన వల్ల జబర్దస్త్ సక్సెస్ అయితే… తనను పట్టించుకోలేదనే ఆవేదనను అంతర్లీనంగా వెల్లడించి.. పైకి మాత్రం… జబర్దస్త్ ఆర్టిస్టులను చెప్పకుండా తొలగించారని.. వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేదనే ఆరోపణలు కూడా చేశారు. ఎన్ని చేసినా .. అదిరింది షో క్లిక్ కాలేదు. సాదా సీదా షోల్లో ఒకటిగా నడుస్తోంది.

అయితే.. ఇప్పుడు హఠాత్తుగా… అదిరింది షో యాంకర్ మారిపోయింది. సమీరా షేక్ అనే యాంకర్‌తో.. నాగబాబు అదిరింది షో ప్రారంభించారు. మంచి మాటకారి.. గ్లామర్ కంటెంట్ కూడా ఎక్కువే ఉండటంతో.. రష్మి, అనసూయలకు పోటీగా ఉంటుందని అనుకున్నారు. కానీ షో పూర్ షోతో.. ఆమె టాలెంట్ కూడా ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. అయితే ఓ షోలో కొంత మంది రావడం.. మరికొంత మంది పోవడం కామనే. కానీ సమీరా షేక్ ఎందుకెళ్లిపోయిందన్న దానిపై.. సోషల్ మీడియాలో రచ్చ అయింది. ఆమెను అవమానకరంగా పంపేశారన్న ప్రచారం జరిగింది. సమీరా షేక్ కూడా.. ఇది నిజమేనన్నట్లుగా వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనతో ఒప్పందం చేసుకున్నన్ని ఎపిసోడ్లకు కూడా యాంకరింగ్ చాన్సివ్వలేదని.. హఠాత్తుగా .. తనను పిలవడం మానేశారని ..పైగా.. తాను ప్రెగ్నెంట్ అని ప్రచారం చేస్తున్నారని మండి పడింది.

అదిరింది షో మొత్తం నాగబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది. అప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులకు అన్యాయం జరిగిందని.. యూ ట్యూబ్ చానల్‌లో రోజు మార్చి రోజు వీడియోలు పెట్టిన ఆయన ఇప్పుడు.. మాత్రం సైలెంటయ్యాయి. సమీరా షేక్ కు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. నాగబాబు.. ఆలోచనల ప్రకారమే.. సమీరా షేక్ ను.. ప్రోగ్రాం నుంచి తీసేశారన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. అదే నిజం అయితే.. నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి చెప్పిన కారణాలకు.. బలం లేకుండా పోతుంది. ఎందుకంటే.. అదిరింది షోలోనూ అదే జరిగింది మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close