ఇసుకను దోచుకుంటోంది ఆ అరవై మంది వైసీపీ నేతలేనట..!

ఆంధ్రప్రదేశ్‌లో అరవై మంది వైసీపీ నేతలు.. ఇసుక మాఫియాను నడుపుతున్నారని.. వీరి గుప్పిట్లోనే.. ఇసుక చిక్కుకుపోయిందని.. టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. పదమూడు జిల్లాల్లో ఇసుకను గుప్పిట్లో పెట్టుకున్న అరవై మంది వైసీపీ నేతల పేర్లను.. టీడీపీ నేతలు చార్జిషీట్ పేరుతో విడుదల చేశారు. టీడీపీ నేతలు విడుదల చేసిన పేర్లలో… తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా, పార్థసారధి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, రోజా, పెద్ది రెడ్డి వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరు.. వీరి అనుచరులు .. మొత్తం ఇసుక రీచ్‌లను గుప్పిట్లో పెట్టుకుని… బ్లాక్‌లో అమ్మి.. ప్రజలను దోచుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో.. ఎన్ని సార్లు వరదలు వచ్చినా.. రాని ఇసుక కొరత ఇప్పుడే ఎందుకు వచ్చిందని టీడీపీ నేతలు ప్రశ్నించారు. లారీ నలబై వేలకు.. ఎన్ని లారీలు కావాలంటే..అన్ని లారీలు వైసీపీ నేతలు పంపుతున్నారని.. కానీ.. ఆన్ లైన్‌లో మాత్రం నో స్టాక్ బోర్డులు ఉంచుతారని మండిపడ్డారు. ప్రతి చోటా వైసీపీ నేతల ప్రమేయంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు. పూర్తి ఆధారాలతోనే తాము.. ఇసుక మాఫియాలో.. వైసీపీ నేతల హస్తంపై.. చార్జిషీటు విడుదల చేస్తున్నామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

ఇసుక కొరతపై ప్రభుత్వ వైఖరిని నిరసనగా.. ఉపాధి కోల్పోయిన కూలీలకు బాసటగా ఉండేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు గురువారం రోజు.. విజయవాడ ధర్నాచౌక్‌లో దీక్ష చేయబోతున్నారు. భారీ ఎత్తున ప్రజామద్దతు కూడట్టుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక మాఫియా అంటూ.. అరవై మంది నేతలపై.. ఆరోపణలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలు.. ఇసుక మాఫియాగా మారిపోతూంటారు.గత ప్రభుత్వంలో టీడీపీ నేతలపైనా అవే ఆరోపణలు వచ్చాయి. కానీ ఇసుక మాత్రం.. ఎప్పుడూ.. బంగారంగా మారలేదు. వైసీపీ సర్కార్‌లో మాత్రం.. ఇసుక బ్లాక్ మార్కెట్‌లో మాత్రమే.. అదీ.. భారీ రేటుకు దొరుకుతోంది. అందుకే.. టీడీపీ హయాంతో పోలిస్తే.. వైసీపీకే ఎక్కున చెడ్డపేరు వచ్చిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ పార్టీకి ” వైఎస్ఆర్” నోటీసులొచ్చాయ్..!

జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని యువజన శ్రామిత రైతు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎలా వాడుకుంటున్నారంటూ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా...

పవన్ కి మద్దతివ్వను, జగన్ ని ప్రశ్నించను, కేంద్రంపై నెట్టిస్తా, తప్పుకుంటా: ముద్రగడ లేఖ

ముద్రగడ పద్మనాభం తమ జాతిని ఉద్దేశించి మరొకసారి సుదీర్ఘమైన లేఖ రాశారు. 2 వారాల క్రితం ముద్రగడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసిన లేఖ సొంత సామాజిక వర్గం నుండే విమర్శలు పొందడం...

“కాపు రిజర్వేషన్ ఉద్యమం” కాడి దించేసిన ముద్రగడ..!

గజదొంగ, కులద్రోహి అంటున్నారని.. ఆ ఆవేదన భరించలేని.. అందుకే కాపు ఉద్యమం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని... ముద్రగడ పద్మనాభం ప్రకటన చేశారు. ఈ మేరకు..బహిరంగ లేఖ విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాపులకు...

అనవసరమైన ట్వీట్లతో గందరగోళం సృష్టిస్తున్న నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కానీ, సినీ రంగంలో ప్రత్యర్థులు కానీ చిరంజీవి పైన లేదంటే పవన్ కళ్యాణ్ పై నోరు...

HOT NEWS

[X] Close
[X] Close