మీడియా వాచ్ : చిక్కిపోతున్న న్యూస్‌ పేపర్ల సైజ్..!

తెలుగునాట న్యూస్ పేపర్ల సైజ్ రాను రాను చిక్కిపోతోంది. అది సర్క్యూలేషన్‌లో మాత్రమే కాదు… పేజీల సంఖ్యలో కూడా. తరం మారుతోంది. పాఠకుల అభిరుచి మారుతోంది. క్షణక్షణం అప్ డేట్స్ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. తర్వాతి రోజు ఉదయం వచ్చే న్యూస్ పేపర్‌ చదవాలంటే.. చాలా ఓపిక ఉండాలి. కొనాలంటే.. ఇంకా అంత కంటే ఎక్కువ ఓపిక ఉండాలి. ఆ పరిస్థితి రాను రాను తగ్గిపోతోంది. ఫలితంగా.. సర్క్యూలేషన్‌లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రధాన పత్రిక చందాలు.. నెలవారీగా తగ్గడమే కానీ.. పెరగడం ఉండటం లేదు. ఈ కారణంగా.. పత్రికలన్నీ.. సంస్కరణ బాటలో ఉన్నాయి. అందులో మొదటి సంస్కరణ.. పేజీల సంఖ్యను తగ్గించడం.

ఈనాడు దినపత్రిక పేజీలు కొద్ది రోజుల క్రితం వరకూ పద్దెనిమిది పేజీలు ఉండేవి. సహజంగా.. ఈనాడులో ప్రకటనలు ఎక్కువ కాబట్టి.. ఎక్కువ వార్తల్ని కవర్ చేయడానికి.. ఎక్కువ పేజీలు ముద్రించేవారు. కానీ ఇప్పుడు.. ఎన్ని ప్రకటనలు ఉన్నప్పటికీ.. మొత్తం పేజీలను 14కి మించనీయడం లేదు. సాక్షి పత్రిక కూడా అదే బాట.. ఆ పత్రిక కూడా పధ్నాలుగు పేజీలే లిమిట్ గా పెట్టుకుంది. ఆంధ్రజ్యోతి ఒక్కో సారి పన్నెండు పేజీలకే పరిమితమవువుతోంది. తెలంగాణలో నమస్తే తెలంగాణ, వెలుగు లాంటి పత్రికలు కూడా.. పేజీలను కట్టడి చేసుకున్నాయి. కొన్ని పత్రికలు పది పేజీలకే పరిమితమయ్యాయి.

సర్క్యూలేషన్‌లో అగ్రశ్రేణి పత్రికగా ఉన్న ఈనాడు దినపత్రిక సర్క్యూలేషన్.. క్రితం సారి అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తగ్గిపోయింది. భారీగా కాదు కానీ.. తగ్గిపోయిందన్నది వాస్తవం. ఎన్నికల వేడి ఉండబట్టి… ఆ కొద్దిగా తగ్గుదల.. లేకపోతే.. ఇంకా ఎక్కువ తగ్గుదల నమోదయ్యేది. ఆంధ్రజ్యోతితో పాటు ఇతర పత్రికలదీ అదే పరిస్థితి. సాక్షి యాజమాన్యం.. ఏపీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి. ప్రభుత్వం తరపున కొనిపించే కాపీలతో.. కాస్త పెరుగుదల కనిపించింది. కానీ వాస్తవంగా.. పాఠకులు కొనే వారి సంఖ్య భారీ పతనం అయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొన్నాళ్లకు న్యూస్ పేపర్ … సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కనుమరుగైన ల్యాండ్ లైన్ లాగా అయిపోయే పరిస్థితి ఖాయమని అర్థం చేసుకోవచ్చు. ఈ పతనం.. ఎంత వేగంగా ఉంటే.. ఆ పరిస్థితి అంతే వేగంగా వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ” అనంత పద్మనాభుని” బాధ్యతలు..!

దేశంలో అత్యంత ధనిక ఆలయంగా పేరు తెచ్చుకున్న కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం బాధ్యత ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదేనని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అలాగే త్రివేండ్రం...

జగన్ పార్టీకి ” వైఎస్ఆర్” నోటీసులొచ్చాయ్..!

జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని యువజన శ్రామిత రైతు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎలా వాడుకుంటున్నారంటూ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా...

పవన్ కి మద్దతివ్వను, జగన్ ని ప్రశ్నించను, కేంద్రంపై నెట్టిస్తా, తప్పుకుంటా: ముద్రగడ లేఖ

ముద్రగడ పద్మనాభం తమ జాతిని ఉద్దేశించి మరొకసారి సుదీర్ఘమైన లేఖ రాశారు. 2 వారాల క్రితం ముద్రగడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసిన లేఖ సొంత సామాజిక వర్గం నుండే విమర్శలు పొందడం...

“కాపు రిజర్వేషన్ ఉద్యమం” కాడి దించేసిన ముద్రగడ..!

గజదొంగ, కులద్రోహి అంటున్నారని.. ఆ ఆవేదన భరించలేని.. అందుకే కాపు ఉద్యమం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని... ముద్రగడ పద్మనాభం ప్రకటన చేశారు. ఈ మేరకు..బహిరంగ లేఖ విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాపులకు...

HOT NEWS

[X] Close
[X] Close