క‌మెడియ‌న్ల‌తో హీరో గారి సినిమా!

యువ హీరోలంతా నిర్మాణ రంగంపై దృష్టి పెడుతున్నారు. త‌మ సినిమాల్లో తామే హీరోలుగా న‌టించేయ‌కుండా, మిగిలిన వాళ్ల‌కు అవ‌కాశాలు ఇస్తున్నారు. నాని సినిమాలో నాని హీరో కాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా త‌న స్నేహితుడైన త‌రుణ్ భాస్క‌ర్‌ని హీరోగా చేశాడు. ఇప్పుడు సందీప్ కిష‌న్ కూడా అదే ప‌నిచేస్తున్నాడు.

సందీప్ కిష‌న్ నిర్మాత‌గా `నిను వీడ‌ని నీడ‌ను నేనే` చేశాడు. అందులో తానే హీరో. ఇప్పుడు మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఈసారి మాత్రం తాను కేవ‌లం నిర్మాత పాత్ర‌కే ప‌రిమితం అవ్వాల‌నుకుంటున్నాడు. హీరోలుగా రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శ‌న్‌లు న‌టిస్తారు. స్క్రిప్టు సిద్ధ‌మ‌వుతోంది. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తుంది. ఈ క‌థ‌లో గ‌మ్మ‌త్తేమిటంటే.. కామెడీ కంటే, యాక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ రాహుల్‌, ప్రియ‌ద‌ర్శిల‌ను క‌మెడియ‌న్లుగానే చూశాం. ఇప్పుడు యాక్ష‌న్ హీరోలుగా అవ‌త‌రించ‌బోతున్నార‌న్న‌మాట‌. అదెలా ఉంటుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close