అమరావతికి అధికారికంగా సింగపూర్ గుడ్ బై..!

అమరావతితో సింగపూర్ అనుబంధం రద్దయింది. రాజధానికి ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చి.. స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం.. చేసుకున్న ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేకపోవడంతో రద్దు చేసుకున్నట్లుగా సింగపూర్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక.. రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ముందుకు వెళ్లొద్దని కోరిందని ..సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ అధికారిక ప్రకటనలో తెలిపారు. పరస్పర అంగీకారంతో ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఈ పరిణామాల వల్ల ..ఇండియాలో తమ పెట్టుబడులపై దీని ప్రభావం ఏమి ఉండదని.. ఈశ్వరన్ తెలిపారు.

సింగపూర్ ప్రభుత్వం ఈ అధికారిక ప్రకటన విడుదల చేయక ముందే.. ఏపీ సర్కార్… స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఏడీసీఎల్‌ – సింగపూర్‌ కన్సార్షియంలు సంయుక్త భాగస్వాములుగా ఏర్పాటు చేసిన జేపీవీ.. అమరావతి డెవలప్ మెంట్‌ పార్టనర్‌ను కూడా రద్దు చేశారు. ఈ ప్రాజెక్ట్ పై సింగపూర్ ప్రభుత్వం ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చును ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇలా చెల్లించేందుకు అంగీకరించడంతోనే….సింగపూర్ కూడా.. ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి నిర్ణయించింది.

వైసీపీ సర్కార్ ఏర్పడినప్పటి నుండి..అమరావతి విషయంలో ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి…నిర్మాణాలన్నింటినీ నిలిపివేశారు. రాజధానిపై రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా..రాజధానిని నిపుణుల కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేస్తామని.. మంత్రి బొత్స పదే పదే ప్రకటిస్తున్నారు. ఆ నిపుణుల కమిటీ అందరి అభిప్రాయాలు సేకరిస్తోంది. త్వరలో నిర్ణయం ప్రకటించనుంది. ఈ లోపే… సింగపూర్ తో అమరావతి అభివృద్ధి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ...కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close