చంద్రబాబు దీక్ష రోజు నుంచే ఇసుక వారోత్సవాలు..!

చంద్రబాబు ఇసుక దీక్ష చేయనున్న రోజు నుంచే.. ఇసుక వారోత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. గత సమీక్షలో కేవలం ఇసుక సమస్యలపై.. స్పందన కార్యక్రమం నిర్వహించి.. ఆ తర్వాత నెలాఖరులోగా… వారోత్సవాలు నిర్వహిద్దామని అధికారులకు సూచించారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఇసుక కొరతను తీర్చేందుకు వారోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించిన రెండు వారాల తర్వాత.. వారోత్సవాల తేదీని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఈ నెల పధ్నాలుగో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా.. ఇసుక మీదే పని చేయాలని ఆదేశించారు. వరదలతో రీచ్‌లు మునిగిన కారణంగా ఇప్పటి వరకూ డిమాండ్‌ను చేరుకోలేకపోయామని…గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందని సీఎం ప్రకటించారు. రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కి చేరిందన్నారు.

ఇసుక కొరత తీరే వరకూ సిబ్బంది సెలవులు తీసుకోవద్దని ఆదేశించారు. 137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయింట్లు పెంచాలని స్పష్టం చేశారు. ఇసుక వారోత్సవాలు ప్రారంభమయ్యే పధ్నాలుగో తేదీలోగా..రేటు కార్డును నిర్ణయించాలని …ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్ల వరకు జైలుశిక్ష విధించాలని స్పష్టం చేశారు. సరిహద్దుల్లోని అన్ని రూట్లలో చెక్‌పోస్టులు పెట్టాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిజానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పడి నుంచి ముఖ్యమంత్రి…ఈ చెక్ పోస్టులు, సీసీ కమెరాల గురించి చెబుతూనే ఉన్నారు. ఇప్పటికీ స్టాక్ యార్డుల్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఇక రీచ్ లలో రాత్రిళ్లు మొత్తం ఇసుక తవ్వుతూనే ఉన్నా..పట్టించుకునేవారు ఉండటం లేదు.

విపక్షాల ఇసుక పోరాటాలతో… ప్రభుత్వానికి సెగ తగులుతోంది. కూలీలు ప్రతీ రోజూ ఎక్కడో చోట ఉపాధి లేకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో.. సహజంగానే ప్రజల్లో అసహనం కనిపిస్తోంది. వరదల పేరుతో.. ప్రభుత్వం…అబద్దాలు చెబుతోందని… ఇసుక బ్లాక్ మార్కెట్‌లో ఎలా దొరుకుతోందన్న భావన ప్రజల్లోకి వచ్చింది. పైగా ఇప్పుడు వరదలు తగ్గిపోయాయి.. అయినప్పటికీ.. ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వచ్చిన రేటు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని గుర్తించి.. విపక్షాల పోరాటాలకు కౌంటర్ ఇవ్వాలన్న లక్ష్యంతో… పధ్నాలుగు నుంచే..వారోత్సవాలకు జగన్ ప్లాన్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ...కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close