బాల‌య్య సినిమాపై సంజూ ఎఫెక్ట్‌

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బోయపాటి సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని స్టైలీష్ గా తీర్చిదిద్ద‌డం క‌నిపిస్తుంది. హీరో కంటే ధీటుగా ఆ పాత్ర‌ని మ‌లుస్తాడు బోయ‌పాటి. అందుకోసం.. హీరోల్ని సైతం విల‌న్లుగా మారుస్తుంటాడు. బాల‌య్య సినిమాకీ అదే చేద్దామ‌నుకున్నాడు. బాలీవుడ్ నుంచి సంజ‌య్‌ద‌త్‌ని రంగంలోకి దింపుదామ‌నుకున్నాడు. సంజ‌య్‌తో సంప్ర‌దింపులూ జ‌రిగాయి. కానీ.. ఇప్పుడు ఆ అవ‌కాశం లేదు. ఎందుకంటే సంజయ్ ప్ర‌స్తుతం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు.చేతిలో ఉన్న‌` కేజీఎఫ్‌` సినిమాని పూర్తి చేస్తే చాలు… అనుకుంటున్నాడు.

అన్నీ బాగుంటే సంజూ – బాల‌య్య‌లు ఢీ కొట్టుకోవ‌డం చూసుండేవాళ్లం. సంజ‌య్ వ‌చ్చి ఉంటే ఈ సినిమా స్వ‌రూప‌మే మారిపోయేది. మార్కెట్ ప‌రంగానూ క్రేజ్ వ‌చ్చేది. హిందీ డ‌బ్బింగ్ రేట్ డ‌బుల్ అయ్యేది. ఇప్పుడు వాటికి ఆస్కారం లేదు. సంజ‌య్ లాంటి ప‌వ‌ర్‌ఫుల్ న‌టుడ్ని, అంత‌టి ఇమేజ్ ఉన్న న‌టుడ్ని వెదికి ప‌ట్టుకోవ‌డం బోయ‌పాటికి ఇప్పుడు క‌ష్టంగా మారింది. సంజ‌య్ ద‌త్‌ని ఫిక్స్ చేసి, ఆ పాత్ర‌లో అంత‌కంటే చిన్న స్థాయి న‌టుడ్ని అటు బాల‌య్య‌, ఇటు బోయ‌పాటి ఇద్ద‌రూ ఊహించుకోలేక‌పోతున్నారు. గ‌త నెల రోజుల నుంచీ… బోయ‌పాటి విల‌న్ పాత్ర‌ధారి కోసం అన్వేష‌ణ చేస్తూనే ఉన్నాడు. అయినా… ఆ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి రాలేదు. అటు విల‌న్ నీ, ఇటు హీరోయిన్ నీ వెదికిప‌ట్టుకోవ‌డం బోయ‌పాటికి స‌వాల్ గా మారింది. “బోయ‌పాటి ద‌గ్గ‌ర చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఈనెలాఖ‌రులోగా విల‌న్ , క‌థానాయిక‌తో పాటు మిగిలిన తారాగ‌ణం లిస్టుని సైతం ఫైన‌లైజ్ చేస్తారు“ అని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఈ సినిమా డిసెంబ‌రు వ‌ర‌కూ ప‌ట్టాలెక్క‌ద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ.. షూటింగ్ వీలైనంత త్వ‌ర‌గా మొద‌లెట్ట‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంద‌ని స‌మాచారం.

కొత్త షెడ్యూల్ ఓ ఇంటి నేప‌థ్యంలో సాగ‌బోతోంది. అందుకోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ భారీ బంగ్లా కోసంచిత్ర బృందం వెదుకులాట మొద‌లెట్టింది. నిజానికి ఈ ఇంటి సెట్ నే వేయాల‌నుకున్నారు. కానీ.. ఇప్పుడు అంత స‌మ‌యం లేక‌పోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నం మానుకున్నారు. అక్టోబ‌రు మొద‌టి వారంలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

పెళ్లి సంద‌డి ‘క్లాసులు’ షురూ!

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. ఆనాటి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయిన‌ట్టే, ఇప్ప‌టి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ త‌న‌యుడ్ని హీరోగా ఎంచుకున్నారు. శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్‌కి ఇప్ప‌టికే...

HOT NEWS

[X] Close
[X] Close