ప‌వ‌న్ ఫిట్‌నెస్‌పై ద‌ర్శ‌కుల బెంగ‌

రాక రాక సినిమాల‌పై ప్రేమొచ్చింది ప‌వ‌న్‌కు. 2009 ఎన్నిక‌ల కోసం రాజ‌కీయాల‌తో బిజీ అయిన ప‌వ‌న్‌… ఆ త‌ర‌వాత కాస్త బ్రేక్ ఇచ్చి, సినిమాల‌పై దృష్టి పెట్టాడు. రెండేళ్ల వ్య‌వ‌ధిలో నాలుగు సినిమాలు పూర్తి చేయాల‌ని భావించాడు. అయితే ప‌వ‌న్ ప్లానింగ్ పై క‌రోనా పెద్ద దెబ్బ కొట్టింది. లాక్ డౌన్ వ‌ల్ల‌, షూటింగులు ఆగిపోయాయి. వ‌రుస‌గా సినిమాపై సినిమా చేద్దామ‌న్న ప‌వ‌న్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. వ‌కీల్ సాబ్ ని పూర్తి చేయ‌డం ప‌వ‌న్ ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యంగా మారింది.

షూటింగుల‌కు మ‌ళ్లీ వాతావ‌ర‌ణం అనుకూలించ‌డంతో, మెల్ల‌మెల్ల‌గా స్టార్లంతా బ‌రిలోకి దిగుతున్నారు. ప‌వ‌న్ సైడ్ నుంచి కూడా అంతా ఓకే. వ‌చ్చే నెల‌లోనే `వ‌కీల్ సాబ్` షూటింగ్ మొద‌లుకానుంది. ప‌వ‌న్ కూడా బ‌రిలో దిగ‌డానికి సిద్ధంగానే ఉన్నాడు. కాక‌పోతే.. ప‌వ‌న్ ఫిట్ నెస్‌పైనే ద‌ర్శ‌కుల బెంగ‌. షూటింగుల కోసం కాస్త బ‌రువు త‌గ్గి ఇది వ‌ర‌కటి లుక్ లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌, లాక్‌డౌన్ తో మ‌ళ్లీ బ‌రువు పెరిగాడు. గెడ్డం, జుత్తూ పెంచి – హీరో లుక్‌కి చాలా దూరం నిల‌బ‌డ్డాడు. ప‌వ‌న్ ఇది వ‌ర‌క‌టి షేప్ లోకి రావ‌డానికి కాస్త టైమ్ ప‌డుతుంది. ఇప్పటి నుంచి ప‌వ‌న్ త‌న ఫిట్ నెస్‌పై దృష్టి పెడితే త‌ప్ప – షూటింగులు మొద‌ల‌య్యేస‌రికి ఫిట్ గా మార‌డు. కానీ.. ప‌వ‌న్ ఫిట్ నెస్ పై ఏమాత్రం గురి పెట్ట‌లేన‌ట్టు తెలుస్తోంది. పైగా ప‌వ‌న్ ఇప్పుడు దీక్ష‌లో ఉన్నాడు. ఈ స‌మ‌యంలో.. ఫిట్ నెస్ గురించి ఆలోచించ‌డం కూడా క‌ష్ట‌మే. వ‌కీల్ సాబ్ లో లుక్ కీ, ఇప్ప‌టి లుక్ కీ చాలా తేడా వుంది. ఆ విష‌యం గుర్తు చేసి, ఫిట్ నెస్ పై దృష్టి పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇవ్వ‌డానికి ద‌ర్శ‌కుల‌కూ, నిర్మాత‌ల‌కూ ధైర్యం స‌రిపోవ‌డం లేదు. ప‌వ‌న్ త‌నంత‌ట తాను గ్ర‌హించి, మ‌ళ్లీ క‌స‌ర‌త్తులు మొద‌లెడితే గానీ, హీరో లుక్ లోకి మార‌డు. ప‌వ‌న్ కోసం ప్ర‌త్యేక‌మైన ట్రైన‌ర్ ని, లుక్ ని మార్చాల‌ని దిల్ రాజు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు క్రిష్‌కీ ఇదే ఆలోచ‌న వ‌చ్చింది. కానీ.. దాన్ని ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్ల‌డానికి ఆలోచిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close