పంత్‌కి పోటీ వ‌చ్చాడు

ధోనీ రిటైర్‌మెంట్ త‌ర‌వాత‌.. ఆస్థానంలో ఎవ‌రొస్తారు? ధోనీని భ‌ర్తీ చేసే స‌త్తా ఎవ‌రికి ఉంది? అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా క‌నిపించాడు పంత్‌. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సైతం రెండో వికెట్ కీప‌ర్ గా స్థానం సంపాదించాడు. దూకుడైన ఆట‌తో పంత్ కొన్ని మ్యాచ్‌ల‌లో ఆక‌ట్టుకున్నాడు. గ‌త ఐపీఎల్ లో విజృంభించిన పంత్ పై.. భార‌త క్రికెట్ అభిమానులు చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. అయితే… అంచ‌నాలు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో పంత్ పై భారం ఎక్కువైంది. ఇటీవ‌ల పెద్ద‌గా రాణించ‌లేదు. వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క‌మైన స‌మ‌యాల్లో పేల‌వ‌మైన షాట్ల‌తో త‌న‌కు తానుగా వికెట్లు స‌మ‌ర్పించుకున్నాడు. కానీ.. పంత్ ని మించిన ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో త‌న‌నే కీప‌ర్ గా కొన‌సాగించాల్సివ‌చ్చింది.

అయితే.. ఇప్పుడు పంత్ కి పోటీగా సంజూ శాంస‌న్ రేసులోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్ లో.. సంజూ ఆట ఎప్పుడూ ఆక‌ట్టుకుంటూనే ఉంటుంది. చెన్నైతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో రాజ‌స్థాన్ త‌ర‌పున అద్భుతంగా ఆడి.. మ‌రోసారి అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్నాడు. 34 బంతుల్లో 9 సిక్స్‌ల స‌హాయంతో 74 ప‌రుగులు చేశాడు. నిల‌బ‌డిన చోట నుంచే.. సిక్స్‌లు కొట్టి – అద‌ర‌హో అనిపించాడు. సంజూ బ్యాటింగ్ చూస్తే.. భార‌త‌జ‌ట్టుకు ఓ మంచి వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ దొరికిన‌ట్టే అనిపించింది. గ‌తంలోనూ సంజూకి ఒక‌ట్రెండు అవ‌కాశాలు వ‌చ్చాయి. తకానీ త‌న‌ని తాను నిరూపించుకునే ఛాన్సులే రాలేదు. అయితే ఈసారి మాత్రం పంత్ కి బ‌దులుగా త‌న పేరు ప‌రిశీలించొచ్చ‌న్న భ‌రోసాని క‌లిగించాడు. వికెట్ల వెనుక కూడా చాలా చురుగ్గా స్పందించాడు. రెండు క్యాచ్‌లు ప‌ట్టుకోవ‌డంతో పాటు, రెండు స్టంపౌట్లు చేశాడు. ఇప్పుడు ఒత్తిడి అంతా పంత్ పైనే. ఈ ఐపీఎల్‌లో పంత్ రాణించ‌క‌పోతే – త‌న స్థానంలో సంజూ దూసుకొచ్చే అవాకాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూ రేటు: రోజుకి 20 ల‌క్ష‌లు

ఈ కరోనా స‌మ‌యంలో.. సోనూసూద్ రియ‌ల్ హీరో అయిపోయాడు. హీరోల‌కూ, రాజ‌కీయ నాయ‌కుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, సంస్థ‌ల‌కు ధీటుగా - సేవ‌లు అందించాడు. త‌న యావ‌దాస్తినీ దాన ధ‌ర్మాల‌కు ఖ‌ర్చు పెట్టేస్తున్నాడా? అనేంత‌గా...

స‌ర్కారు వారి పాట అప్ డేట్: మ‌హేష్ ముందే వెళ్లిపోతున్నాడు

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా `సర్కారువారి పాట‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 4 నుంచి అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీసా వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. అయితే చిత్ర‌బృందం కంటే ముందే.. మ‌హేష్...

ఏపీ విద్యార్థుల్ని కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థమవడం లేదు. బస్సుల నుంచి మద్యం వరకూ ..ఉద్యోగాల నుంచి చదువుల వరకూ అన్నింటిపైనా పొరుగు రాష్ట్రాలపైనే ఏపీ ప్రజలు ఆధారపడేలా విధానాలు...

“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట... పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్...

HOT NEWS

[X] Close
[X] Close