మీడియా వాచ్: బిల్ గేట్స్ తో తెలుగు ఛానల్ సీఈవో

గ్లోబల్ బిజినెస్ సమ్మిట్- 2020 కు సర్వం సిద్ధమైయింది. కరోనా నేపధ్యంలో వర్చువల్ గా జరగనున్న ఈ సమావేశంలో ప్రపంచ ప్రఖ్యాత బిల్ గేట్స్ తో కలిసి ప్రపంచ వ్యాపార వేదిక పై తమ ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, అవకాశాల పై పలువురు ప్రముఖులు చర్చించనున్నారు. ఈ రోజు జరిగిగే ఈ సమ్మిట్ లో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి హాజ‌ర‌వుతున్నారు.

ఇక్కడ ఇంకో విశేషం కూడా వుంది. ఈ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం ఓ తెలుగు న్యూస్ ఛానల్ సీఈవోకి దక్కింది. AP24*7 ఛానల్ CEO సుధాకర్ అడపా కూడా ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. సుధాకర్ ది బిజినెస్ నేపధ్యం, ఐఐఎం గ్రాడ్యుయేట్, పలు కంపెనీలకు సీఈవోగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయనకి ఈ సమ్మిట్ లో పాల్గొనే అవాకాశం దక్కింది. ఏదేమైనా బిల్ గేట్స్ లాంటి దిగ్గజాలు పాల్గొనే ఇలాంటి సమిట్ లో ఓ తెలుగు ఛానల్ సిఈవో పాల్గొనడం బహుసా ఇదే ప్రధమం కావచ్చు. అలాగే ఈ సమ్మిట్ లో భారత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నెట్ ఫ్లిక్స్ కో సీఈఓ టెడ్ సారండోస్.. కూడా పాల్గొంటారు. కరోనా నేపధ్యంలో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచం ఎలాంటి సవాళ్ళు ఎదురుకొని మళ్ళీ ఆర్ధికంగా పుంజుకోవాలనే అంశాలు ఈ సమిట్ లో చర్చకు రానున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close