ఈ సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రు?

ప్ర‌తీ యేటా సంక్రాంతికి థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడిపోవ‌డం చూస్తూనే ఉంటాం. ఈసారీ ఆ హంగామా క‌నిపించింది. స్టార్ హీరోలు దూర‌మైనా, నాలుగు సినిమాలొచ్చాయి. బంగార్రాజు, హీరో, రౌడీ బోయ్స్‌, సూప‌ర్ మచ్చీ సంక్రాంతి బ‌రిలో నిలిచాయి. సూప‌ర్ మ‌చ్చీకి ఏమాత్రం ప్ర‌మోష‌న్లు లేక‌పోవ‌డంతో అస‌లు ఆ సినిమానే ఎవ‌రూ లెక్క‌లోనికి తీసుకోలేదు. ఇక మిగిలిన‌వి మూడే సినిమాలు. అందులో బంగార్రాజు ఒక్క‌టే స్టార్ సినిమా. మిగిలిన రెండు సినిమాల్లోనూ డెబ్యూ హీరోలే.

మొహ‌మాటం లేకుండా చెప్పాలంటే మూడూ అత్తెస‌రు మార్కులు తెచ్చుకున్న సినిమాలే. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు దేనికీ ద‌క్క‌లేదు. అన్నీ బిలో యావ‌రేజ్ లే. కాక‌పోతే.. బంగార్రాజుకి మంచి వ‌సూళ్లు వచ్చాయి. పండ‌గ సీజ‌న్ ని క్యాష్ చేసుకున్న సినిమా అదే. తొలి మూడు రోజుల్లో రూ50 కోట్లు సంపాదించామ‌ని చిత్రబృందం చెబుతోంది. నాగార్జున సినిమా. అందులోనూ చైతూ ఉన్నాడు. పండ‌గ వాతావ‌ర‌ణం.. ట్రైల‌ర్‌లో క‌నిపించింది. దాంతో.. కుటుంబ ప్రేక్ష‌కులు బంగార్రాజు వైపు మొగ్గు చూపించారు. చిన్న గీత పెద్ద గీత‌లా క‌నిపించాలంటే ప‌క్క‌న మ‌రింత చిన్న గీత గీయాలి. బంగార్రాజు చిన్న గీతే కావొచ్చు. కానీ.. దాని ప‌క్క‌న రౌడీ బోయ్స్‌, హీరో.. ఇంకా చిన్న గీత‌లు. దాంతో బంగార్రాజు పెద్ద గీతైపోయింది. ఈ సంక్రాంతికి ఈ సినిమానే దిక్క‌య్యింది. దాంతో వ‌సూళ్లు జోరుగా అందుకున్నాడు. రౌడీ బోయ్స్ కీ కొద్దో గొప్పో వ‌సూళ్లు ఉన్నాయి. హీరోకి అంతంత మాత్ర‌మే ఆద‌ర‌ణ ద‌క్కింది. ఎటు చూసినా, ఈ సంక్రాంతి విజేత బంగార్రాజే. కాక‌పోతే… నికార్స‌యిన సినిమా లేని లోటు ఈ పండ‌క్కి బాగా క‌నిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close