టైటిల్ కోసం ‘వార్’ మొద‌ల‌వుతుందా?

రామ్ – లింగుస్వామి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దీనికి `ది వారియ‌ర్‌` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రామ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రివీల్ అయ్యాడు. త‌న‌కు పోలీస్ గెట‌ప్ ప‌ర్‌ఫెక్ట్ గా సూట‌య్యింది. నిజంగానే వారియ‌ర్ లా ఉన్నాడు. టైటిల్ బాగుంది కానీ, ఈ టైటిల్ పై వార్ జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఎందుకంటే… ఇదే టైటిల్ ఇది వ‌ర‌కు వేరే సంస్థ‌లో రిజిస్ట‌ర్ చేశారు, హ‌వీష్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమాకి `వారియ‌ర్‌` అనే టైటిల్ పెట్టారు, ఈరోజు ఉద‌య‌మే ఈ టైటిల్ రివీల్ చేశారు. రెండు గంట‌ల త‌ర‌వాత రామ్ సినిమా టైటిల్ ఎనౌన్స్ అయ్యింది. రామ్ – లింగు స్వామి సినిమాకి `ది వారియ‌ర్‌` అనే టైటిల్ పెడ‌తార‌న్న విష‌యం తెలుసుకున్న‌.. హ‌వీష్ టీమ్ అర్జెంటుగా, వాళ్ల కంటే ముందు వారియ‌ర్ టైటిల్ ని వ‌దిలింది. ఇప్పుడు లింగు స్వామి టీమ్ ఇర‌కాటంలో ప‌డింది. ఒకే టైటిల్ తో రెండు సినిమాలు, ఏక కాలంలో రూపుదిద్దుకోవ‌డం ఈమ‌ధ్య జ‌రిగింది. కానీ.. చివ‌రికి ఒక సినిమాకే ఆ టైటిల్ కేటాయించారు. ఇద్ద‌రు నిర్మాత‌ల్లో ఎవ‌రు ముందు ఈ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించారో తెలీదు. టైటిల్ రిజిస్ట్రేష‌న్ విష‌యంలో ఛాంబ‌ర్ లో నిబంధ‌న‌లు ఈ మ‌ధ్య మారాయి. దాన్ని బ‌ట్టి.. వారియ‌ర్ టైటిల్ ఈ రెండు సినిమాల్లో ఎవ‌రికి ద‌క్కుతుందో వాళ్లే
తేల్చాలి. ఇద్ద‌రికీ ఇదే టైటిల్ కావాలంటే… `ది వారియిర్‌` కాస్త `రామ్ వారియిర్‌..` గా మారే అవ‌కాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close