అన్నపూర్ణలో కామెడీ రైలు

అనిల్ రావిపూడి-మహేష్ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో రైలు కామెడీ గురించి ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. గతంలో శ్రీనువైట్ల వెంకీ సినిమాలో చేసిన ట్రయిన్ కామెడీ లాంటిది ఈ సినిమాలో అనిల్ రావిపూడి చేయబోతున్నాడన్నది ఆ వార్తలు సారాంశం. ఇప్పుడు ఇదే సీన్ మీద మరిన్ని అప్ డేట్స్ బయటకు వస్తున్నాయి.

కాశ్మీర్ లో మిలటరీ దళంలో పని చేసే హీరో, ఆంధ్రకు ట్రయిన్ లో బయలుదేరతాడట. ఆ సందర్భంగానే ఈ కామెడీ సీన్లు వుంటాయి. కాశ్మీర్ టు ఆంధ్ర ట్రయిన్ జర్నీ అంటే చాలా టైమ్ పడుతుంది.అందుకే సినిమా తొలిసగంలో ఈ ట్రయిన్ ఎపిసోడ్ కాస్త లెంగ్తీగానే వుంటుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లోనే బండ్ల గణేష్ తో పాటు పలువురు కమెడియన్లు కనిపిస్తారు.

ఈ ట్రయిన్ ఎపిసోడ్ కోసం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఏకంగా ఓ రైలు సెట్ నే వేస్తున్నారు. ఎక్కువ షూట్ వుంటుంది కాబట్టి, రియల్ ట్రయిన్ లో తీయడం అంత సాధ్యం అయ్యే పని కాదు. అందుకే సెట్ వేస్తున్నారు. ఇందుకోసం కాస్త భారీగానే ఖర్చు చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా ఈ సెట్ మీదకు ఆగస్టులో వస్తుందని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్లిష్ట‌మైన స్థితిలో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం

ఇటీవ‌ల రాజ‌శేఖ‌ర్ కుటుంబం క‌రోనా బారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌తో పాటు శివానీ, శివాత్మికల‌కు కూడా కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. ఆ త‌ర‌వాత‌.. మిగిలిన‌వాళ్లంతా మెల్ల‌గా కోలుకున్నారు....

చంద్రబాబు బాటలో మహారాష్ట్ర సర్కార్..! సీబీఐకి రెడ్ కార్డ్…!

కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో సీబీఐని వినియోగిస్తున్న తీరు అక్కడి ప్రభుత్వాన్ని చికాకు పరుస్తోంది.సంబంధం లేకపోయినా.. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు.. సిఫార్సులు తెప్పించుకుని.. మహారాష్ట్ర కేసులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తోంది. మొన్నటి సుషాంత్...

బీజేపీ సోషల్ మీడియా ప్రచారంపైనే హరీష్ గుస్సా..!

దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో హరీష్ రావు ఆగ్రహం అంతా బీజేపీనే కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రచారం కాదు... సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపైనే హరీష్ రావు ఆగ్రహం...

పొలాల్లో జగన్ బొమ్మ పెట్టే పథకం ..!

"ఈ పబ్లిసిటీ చూస్తూంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా ఉంది.." అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. చంద్రబాబును విమర్శించేవారు. తీరా ఆయనకు అధికారంలోకి వచ్చాక.. డెత్ సర్టిఫికెట్ల మీద కూడా...

HOT NEWS

[X] Close
[X] Close