భాజ‌పా అధ్య‌క్షుడితో నాదెండ్ల భాస్క‌ర‌రావు భేటీ కానున్నారా..?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు హైద‌రాబాద్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ముందుగా, న‌గ‌ర శివారుల్లోని గిరిజ‌న తండాకి వెళ్తారు. అక్క‌డో గిరిజ‌నుడి ఇంటికి వెళ్లి అల్పాహారం చేస్తారు. ఆ త‌రువాత, శంషాబాద్ లో భాజ‌పా స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు రాత్రి ప‌లువురు నేత‌ల‌తో అమిత్ షా భేటీ అవుతారు. ఈ సంద‌ర్భంగా ఇత‌ర పార్టీలకు చెంది కొంత‌మంది ప్ర‌ముఖులు కూడా ఆయ‌న్ని క‌లిసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు కూడా అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది.

ప్ర‌స్తుతానికి ఆయ‌న క్రియాశీల రాజ‌కీయాల్లో లేరు. ఆయ‌న కుమారుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో కీల‌క నేత‌గా ఉన్నారు. అమిత్ షాతో భేటీ వెన‌క ఆలోచ‌న ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి, ఆంధ్రా రాజ‌కీయాల‌పై భాస్క‌ర‌రావు ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ మీద, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మీద విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు. తాజాగా, జ‌గ‌న్ స‌ర్కారు మీద కూడా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లే చేశారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ పాల‌న ఒక నెల పూర్త‌యిన సంద‌ర్భంగా భాస్క‌ర‌రావు మాట్లాడుతూ… జ‌గ‌న్ ఇచ్చిన హామీలు చూస్తుంటే త‌న‌కు భ‌యం వేస్తోంద‌న్నారు. అమ్మ ఒడి, రైతుల‌కు పెట్టుబ‌డి కింద న‌గ‌దు ఇస్తామ‌న‌డం బాగుందిగానీ, ఇవ‌న్నీ అమ‌లు చేయ‌డానికి కావాల్సిన నిధులు ఎక్కణ్నుంచి వ‌స్తాయో జ‌గన్ చెప్ప‌డం లేద‌న్నారు.

భాజ‌పాకి కావాల్సింది ఇలాంటి వాయిసే క‌దా! తెలుగుదేశం పార్టీ మీద బాగా విమ‌ర్శ‌లు చెయ్య‌గ‌ల‌రు. వైకాపా మీద కూడా ఇలాంటి కామెంట్లు చెయ్య‌గ‌ల‌రు. పైగా ఆయ‌న మాజీ ముఖ్య‌మంత్రి. ఒక‌వేళ ఆయ‌న ఇప్పుడు భాజ‌పాలో చేరినా క్రియాశీలంగా అంటే, ఆ పార్టీ త‌ర‌ఫున బాగా మాట్లాడ‌గ‌లిగే సీనియ‌ర్ నాయ‌కుడిగా మాత్ర‌మే ఉండ‌గ‌ల‌రు. ఇలాంటివారు కూడా పార్టీలో ఉంటే కొంత స‌మ‌తౌల్యం వ‌స్తుంద‌ని భాజ‌పా భావిస్తున్న‌ట్టుగా ఉందేమో చూడాలి. ఏదేమైనా, అమిత్ షాను ఆయ‌న క‌ల‌వబోతున్నారంటూ క‌థ‌నాలు రావ‌డం కొంత ఆస‌క్తిక‌రంగానే మారింది. కుమారుడు జ‌న‌సేన‌లో ఉంటే, తండ్రి భాజ‌పాకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close