స‌ర్కారువారి పాట ట్రైల‌ర్‌: డైలాగులే… డైలాగులు

టీజ‌ర్‌లో, ట్రైల‌ర్‌ల‌లో విజువ‌ల్ ఫీస్ట్ చూపించ‌డానికే ద‌ర్శ‌కులు ఎక్కువ ఇష్ట‌ప‌డుతుంటారు. స‌ద‌రు ర‌చ‌యిత డైలాగ్ రైట‌ర్ అయితే… పంచ్‌లు కూడా బాగా పేల‌తాయి. ఇవి రెండూ మిక్స్ చేసి కొడితే.. అది స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ అవుతుంది. మ‌హేష్‌, ప‌ర‌శురామ్ కాంబోలో రూపొందిన సినిమా ఇది. ఈనెల 12న వ‌స్తోంది. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌లైంది. ప‌ర‌శురామ్ స్వ‌త‌హాగా మంచి రైట‌ర్‌. అందుకే ఈ ట్రైలర్‌లో డైలాగులు కుమ్మి ప‌రేశాడు. ఎక్కువ‌గా మ‌హేష్ నోటి నుంచి వ‌చ్చిన‌వే. చాలామట్టుకు మ‌హేష్ క్యారెక్ట‌ర్ని ఎలివేట్ చేసేలా ఆ డైలాగులు సాగాయి. అందులోనే పంచ్ ఉంది. అందులోనే వెట‌కారం ఉంది. అందులోనే హీరోయిజం క‌నిపించింది. ఈమ‌ధ్య కాలంలో.. ఓ ట్రైల‌ర్ ఇన్ని డైలాగులు ఉండ‌డం ఇదే తొలిసారి.

నా ప్రేమ‌ని దొంగిలించ‌గ‌ల‌వు…
నా స్నేహాన్నీ దొంగిలించ‌గ‌ల‌వు..
యూ కాన్ట్ స్టీల్ మై మ‌నీ.. – ఈ డైలాగ్‌తో మ‌హేష్ క్యారెక్టర్ మొత్తాన్ని చెప్పేశాడు ప‌ర‌శురామ్‌.

అమ్మాయిల్నీ, అప్పు ఇచ్చిన వాళ్ల‌నీ పేంప‌ర్ చేయాలిరా.. ర‌ఫ్‌గా హ్యాండిల్ చేయ‌కూడ‌దు.. – అనేది మ‌రో మంచి డైలాగ్‌.

వై.ఎస్‌.ఆర్ స్లోగ‌న్ ` నేను విన్నాను.. నేను ఉన్నాను..` ఈ ట్రైల‌ర్‌లో మ‌హేష్ ప‌ల‌క‌డం… ఆక‌ట్టుకొంది.

మ‌హేష్ కామెడీ టైమింగ్ సూప‌ర్ గా ఉంటుంది. త‌న వ‌య‌సుమీద త‌నే సెటైర్ వేసుకునేలా.. మ‌హేష్ – వెన్నెల కిషోర్‌ల‌పై ఓ ట్రాక్ సెట్ చేశారిందులో.

ఏమ‌య్యా కిశోర్‌… మ‌న‌కేమైనా మారేజ్ చేసుకునే వ‌య‌సు వ‌చ్చేసిందంటావా..? – అని మ‌హేష్ అడిగితే,

– ఊరుకోండి సార్‌.. మీకేంటి అప్పుడే.. చిన్న పిల్లాడైతే.. – అని వెన్నెల కిషోర్ స‌మాధానం ఇస్తాడు.
ఆవెంట‌నే… `అంద‌రూ నీలాగే అంటున్నార‌య్యా… దీనెమ్మా మెయిటైన్ చేయ‌లేక దూల తీరిపోతోంది..` అంటూ త‌న‌పై త‌నే
సెటైర్ వేసుకున్నాడు మ‌హేష్‌.

అప్ప‌నేది ఆడ‌పిల్ల లాంటిది సార్.. ఇక్క‌డెవ‌రూ బాధ్య‌త గ‌ల తండ్రిలా బిహేవ్ చేయ‌డం లేదు.. అనేది మ‌హేష్ క్యారెక్ట‌ర్ అయితే.. దానికి టోట‌ల్ అపోజిట్ డైలాగ్ `నా దృష్టిలో అప్ప‌నేది సెట‌ప్ లాంటిది..` అని చెప్పి విల‌న్ స‌ముద్ర‌ఖ‌ని ని ఇంట్ర‌డ్యూస్ చేశారు.

`ఎందుకంటే ఆడిది మ‌రి.. పెద్దా…` అంటూ మ‌హేష్ త‌న చేతిని చూపిండంలో డ‌బుల్ మీనింగ్ తాండ‌వించింది. ఇలాంటి మ‌సాలా డైలాగే చివ‌ర్లో ఉంది.

“ఓ వంద వ‌యగ్రాలు వేసి శోభ‌నం కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కొడుకు గ‌దికి వ‌చ్చిన‌ట్టు వ‌చ్చారు..“ అంటూ మ‌హేష్ తో ప‌లికించారు.

మొత్తానికి మ‌హేష్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగులు, విజువ‌ల్స్‌…. అన్నీ ప‌క్కా పైసా వ‌సూల్ సినిమా చూడ‌బోతున్నాం
అనే న‌మ్మ‌కాన్ని క‌లిగించాయి. కీర్తి కూడా తెర‌పై అందంగా ఉంది. వీరిద్ద‌రి కెమిస్ట్రీ వర్క‌వుట్ అవ్వ‌డం ఖాయం.
ఇక టెక్నిక‌ల్ గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌మ‌న్ ఆర్‌.ఆర్ ఎప్ప‌టిలా అదిరింది. విజువ‌ల్ ఫీస్ట్ క‌నిపిస్తోంది. ఓషాట్ లో మ‌హేష్ పూల చొక్కా, చేతిలో పూల దండ‌తో ప్ర‌త్య‌క్షం అవ్వ‌డం ఫ్యాన్స్‌కి మ‌రింత న‌చ్చుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.