[X] Close
[X] Close
రెడ్లను రెచ్చగొట్టిన సర్వే సత్యనారాయణ

హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా వరంగల్ ఉపఎన్నిక సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సర్వే సత్యనారాయణనుంచి వెనకేసుకొచ్చారు. రెడ్డి సామాజికవర్గాన్ని అణచివేసేందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డిలను విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు. కవితకు కేంద్ర మంత్రిపదవికోసం కేసీఆర్ వెంకయ్యనాయుడుతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. హరీష్‌రావును పక్కన పెటట్టం కాంగ్రెస్‌కే అనుకూలమని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాదిగ కాదని చెప్పటం మాదిగలను అవమానించటమేనని అన్నారు. కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కరపత్రంగా పనిచేస్తున్న నమస్తే తెలంగాణపై పరువునష్టం దావా వేస్తామని సర్వే చెప్పారు.

సర్వే సత్యనారాయణ కుమారుడు నవనీత్ హైదరాబాద్-వరంగల్ మార్గంలో రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ సర్వే నం.15లో 1.24 ఎకరాల స్థలాన్ని పట్టాదారులు, అధికారులు, రెవెన్యూ సిబ్బందితో చేతులు కలపటంద్వారా సొంతం చేసుకుని వందలమంది ప్లాట్ల యజమానుల నోట్లో మట్టికొట్టారని నమస్తే తెలంగాణ పత్రిక ఇవాళ మొదటి పేజిలో ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కథనంపైనే నమస్తే తెలంగాణ మీద పరువునష్టం దావా వేస్తానని సర్వే అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించిన ఒడిశా

కరోనా వ్యాప్తి నివారించడానికి భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 15వ తేదీకి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం...

క‌రోనా ఎఫెక్ట్ : బొమ్మ‌కి ‘బొమ్మ’ క‌నిపించ‌డం ఖాయం

బిఫోర్ క‌రోనా - ఆఫ్ట‌ర్ క‌రోనా అని విడ‌దీసుకుని చూసుకోబోతున్నామేమో..? ప‌రిస్థితులు అలానే క‌నిపిస్తున్నాయి. ఎందుకు పుట్టిందో తెలీదు గానీ, ఈ మ‌హ‌మ్మారి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ త‌ల‌కిందులు చేసేసింది. మ‌నిషి మ‌నుగ‌డ‌కే ప్ర‌శ్నార్థ‌కంగా...

12 గంటల్లో ఏపీలో ఒక్కటీ నమోదు కాని పాజిటివ్ కేస్.!

ఆంధ్రప్రదేశ్‌లో గత పన్నెండు గంటల్లో ఒక్కటంటే.. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకూ... చేసిన...

అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం... దానిపైనే దృష్టి పెట్టినా... హఠాత్తుగా వర్శిటీల...

HOT NEWS