సెటైర్ : అల్లుడొచ్చాడు

`పండక్కి అల్లుడు రాలేదటయ్యా?’ ఊరిపెద్ద పరంధామయ్య ప్రశ్న.

`ముందుగా రావాలంటే సెలవు దొరకలేదు. ఇప్పుడేమో హడావుడిగా వస్తున్నాడు ‘ చెప్పాడు జానకిరామయ్య.

`ఎలా వస్తున్నాడేంటీ ? రైల్లోనా, బస్సులోనా, ఫ్లైటెక్కా..?’ పరంధామయ్య మళ్లీ ప్రశ్నించాడు.

`మన ఊరికి రావడానికి రైలే సుఖం కదా.. పరంధామయ్యా, రైల్లోనే వస్తాడు. కాకపోతే రిజర్వేషన్ లేదు. మరి ఎలా వస్తాడో ఏమో..’

`హ్హహ్హాహ్హా.. మరి అదే, నీ అల్లుడికీ, నా అల్లుడికీ మధ్య ఉన్న తేడా. మా అల్లుడు మందుగానే రైలుకి రిజర్వ్ చేయించుకున్నాడయ్యా, హాయిగా బెర్త్ దొరికిందట. కూతురూ అల్లుడు సుఖంగా వచ్చేస్తారనుకో…’ కాస్తంత వ్యంగ్యాన్ని మిళితం చేశాడు పరంధామయ్య.

`పోనీలే అదృష్టవంతులు మీ అమ్మాయి, అల్లుడు. పాపం, మా అల్లుడి ప్రయాణం గురించి ఆలోచిస్తుంటేనే గాబరాఎక్కుతోందనుకో.. ‘

`అవును పేపర్లో చూస్తున్నాంగా… ఎన్ని స్పషల్ రైళ్ళు వేసినా సరిపోవడంలేదు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, హైదరాబాద్ నుంచి సగం మంది తమ ఊర్లకు వెళ్లాల్సిందేనాయె. అందుకే ప్లానింగ్ ఉండాలంటాను. అది లేకపోతే నానా అవస్థ పడాల్సిందేననుకో…’ వెటకారం మళ్లీ కలిపాడు పరంధామయ్య తన మాటల్లో.

`సరే నేను వస్తా పరంధామయ్యా, తెల్లారేసరికి అల్లుడు ఇంట్లో ఉంటాడు. పండుగ పనులు బోలెడు మిగిలిపోయాయి. మళ్ళీ కలుస్తా..’ అంటూ వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు జానకిరామయ్య.

ఆ రోజు రాత్రంతా జానకిరామయ్యకు సరిగా నిద్రపట్టలేదు. అల్లుడు ప్రయాణంలో ఎన్ని కష్టాలు పడుతున్నాడోనని తలుచుకోవడమే సరిపోయింది. జానకి రామయ్య కూతురిదీ అదే పరిస్థితి. తన భర్త రైలు ప్రయాణంలో అగచాట్లు పడుతుంటారని తలుచుకుంటూ వాపోయింది. తెల్లారేసరికి తండ్రీ కూతుర్లకు నిద్రలేమితో కళ్లు వాచిపోయాయి. తెల్లవారగానే పాలుపోయించుకుందామని జానకిరామయ్య క్యాన్ పట్టుకుని వీధి చివరకు వెళ్ళాడు. మంచు బాగా పడుతోంది. ఎదుట వ్యక్తి సరిగా కనిపించడంలేదు. సరిగా అప్పుడే ఒక వ్యక్తి పలకరిస్తూ…

`అంకుల్ బాగున్నారా?’ అలా అడిగిన వ్యక్తిని తేరపారా చూశాడు జానకిరామయ్య.

పలకరించిన వ్యక్తి ముఖం పీక్కుపోయినట్లుంది. చొక్కా చిరిగిపోయింది. నల్లటి తారులాంటి పదార్థమేదో చొక్కాకి, చేతులకు అంటుకుంది. వారంరోజుల పాటు లంఖనం చేసినట్లుంది అతగాడి ఆకారం.

`నేను అంకుల్. గుర్తుపట్టలేదా?’

`అబ్బే.. గుర్తుపట్టలేకపోతున్నాను బాబూ. మంచు బాగా కురుస్తుందా, అసలు కనబడి చావడంలేదు’ అంటూ జానకిరామయ్య కళ్లజోడు తీసి తుడుచుకుని మళ్ళీ పెట్టుకున్నాడు.

`నేను అంకుల్, పరంధామయ్య గారి అల్లుడ్ని. ఇదిగో నా వెనుక నుంచున్నదే తను నా భార్య లక్ష్మి’

అప్పుడు నిశితంగా చూశాడు జానకిరామయ్య. అవును, ఇతగాడు పరంధామయ్య అల్లుడే. ఆ వెనుక ఉన్నది లక్ష్మీనే. అరే అమ్మాయి చీర చిరిగిపోయిందేమిటీ ! ఎవరో చాచికొట్టినట్లు ముఖమంతా కందిపోయింది.

`అదేమిటి బాబూ, అలా అయిపోయారు. అమ్మాయి లక్ష్మి …నువ్వేంటీ…’ మధ్యలో ఆగాడు జానకిరామయ్య.

`ఏం చెప్పమంటారు బాబాయి. రైలు ప్రయాణం చేసేసరికి ఇలా అయిపోయాం’ బావురుమంది లక్ష్మి.

`అదేమిటమ్మా, రైలుకి రిజర్వేషన్ చేయించుకునే బయలుదేరారని చెప్పాడు పరంధామయ్యా ?’ సందేహపడుతూ అడిగాడు జానకిరామయ్య.

`అవునంకుల్ రిజర్వేషన్ చేయించుకునే వచ్చాము’ లక్ష్మి భర్త సమాధానమిచ్చాడు.

`అవున్లే, మీరు రిజర్వేషన్ లేకుండా బయలుదేరరటగా… మీ మామయ్య నిన్న చెప్పార్లే. మరి ఈ అవతారం ఏమిటీ ?’

`అవును బాబాయి ఆయన అంతా ప్లాన్డ్ గా వెళుతుంటారు. ఈసారి కూడా రెండు నెలల ముందే రిజర్వేషన్ చేయించారు. కానీ ఏం లాభం. ఇదిగో ఇలా వచ్చాము’ బావురుమంది లక్ష్మి.

జానకిరామయ్యకు జాలేసింది.

`ఏమైంది తల్లి, ఎందుకంతగా బాధ పడుతున్నావ్ ?’

`ఎలాగో రిజర్వేషన్ ఉందికదా అని రైలు మరో పావుగంటలో బయలుదేరుతుందనగా, స్టేషన్ కు వెళ్ళాము. తీరా అక్కడకు వెళ్ళేసరికి ప్లాట్ ఫాం కిటకిటలాడుతోంది. మా బోగీ వెతుక్కుని చేరేసరికి రైలు బయలుదేరబోతోంది. హడావుడిగా ఎలాగో ఎక్కాము. కానీ, తీరా మా సీట్లలో ఎవరో కూర్చున్నారు. ఇది రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లేవమని అడిగినా వాళ్లు కదలలేదు. ఈ లోగా పక్క బోగీలోంచి జనం మందలా వచ్చిపడ్డారు. ఇక అప్పటి నుంచి మాకు అవస్థలు. టిసీ లోపలకు వచ్చే వీలులేకపోయింది. మా మొర ఆలకించేవాడేలేడు. చివరకు ఇలా వచ్చాము బాబాయి’ ఏడ్చినంత పనిచేసింది లక్ష్మి.

`ఊరుకో అమ్మా, ఊరుకో. పోనీలే ఎలాగోఅలా క్షేమంగా చేరారు. ఇంటికెళ్ళండి. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను’ అంటూ జానకిరామయ్య పాలు పోయించుకుని ఇంటికి దౌడుతీసినంత పనిచేశాడు. రిజర్వేషన్ ఉన్నవాళ్లకే ఇన్ని కష్టాలు వస్తే, తన అల్లుడి పరిస్థితి ఏమిటా ? అన్నది అతగాడి దిగులు.

ఆ దిగులుతోనే ఇంటికి చేరాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే లోపల అల్లుడు కనిపించాడు.

`హలో మామగారూ… ఎలా ఉన్నారు ?’ హుషారుగా అడిగాడు అల్లుడు.

`ఓహ్..నేను బాగానే ఉన్నానయ్యా, మరి నీ ప్రయాణం ఎలా సాగింది?’ అనుమానంతో అడిగాడు.

`చాలా హ్యాపీగా సాగింది మామయ్యగారూ. ఏం ఎందుకని అలా అడిగారు?’

`ఆహా, ఏమీ లేదు. రిజర్వేషన్ లేదుకదా అందుకని…’ నసిగాడు జానకిరామయ్య.

`ఓహ్..అదా మీ భయం. చిత్రమేమంటే, రిజర్వేషన్ లేనివాళ్లంతా ముందే సీట్లు ఆక్యుపై చేశారు. అది తప్పేఅనుకోండి. కానీ ఏం చేస్తాం. క్రైసెస్ వచ్చినప్పుడు రూల్స్ పనిచేయవండి. బండి బయలుదేరడానికి అరగంట మందే నేనో సీట్ లో కూర్చున్నా. అంతే, నన్ను లేపడానికి ఎవ్వరూ రాలేదు. రిజర్వేషన్ చేయించుకున్నవారిలో చాలా మంది అసలు బండే ఎక్కలేకపోయారని తర్వాత తెలిసింది. అదీ కథ’ అంటూ గలగలా నవ్వేశాడు.

అల్లుడి ప్రయాణం సుఖప్రదమైనందుకు జానకిరామయ్యకు సంతోషంగానే ఉన్నప్పటికీ, అతని కళ్లలో రిజర్వేషన్ చేయించుకుని కూడా నానా అవస్థలు పడ్డ ఆ జంటే కళ్లముందు కనిపించసాగారు. ఎవరిని నిందించాలి? అనుకుంటూ పడక కుర్చీలో కూలబడ్డాడు జానకిరామయ్య.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అదానీకి మధురవాడలో 130 ఎకరాలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సుల మేరకు డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి...

కేసీఆర్ అంతకన్నా ఎక్కువే అన్నారుగా..! అప్పుడు కోపం రాలేదా..!?

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. వైఎస్ కుటుంబాన్ని తాను కించపర్చలేదని.. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఇంతకీ...

తిరుపతి సీటు కోసం ఢిల్లీకి పవన్, నాదెండ్ల ..!

బీజేపీకి మద్దతుగా గ్రేటర్ ఎన్నికల బరి నుంచి వైదొలిగిన పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరిపేందుకు నాదెండ్ల మనోహర్‌తో...

గుడ్ న్యూస్‌: థియేట‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్

థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు ఇస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈరోజు ఓ జీవోని విడుద‌ల చేసింది. అయితే కొన్ని ష‌ర‌తులు విధించింది. సిట్టింగ్ సామ‌ర్థ్యాన్ని 50 శాతానికి ప‌రిమితం చేసింది. ప్ర‌తి ప్రేక్ష‌కుడూ.....

HOT NEWS

[X] Close
[X] Close