`అసహనం’ నవ్వుతోంది…

(సెటైర్)

నా పేరు అసహనం. ఇప్పుడు నేను విజయానికి చేరువలో ఉన్నాను. విజయం వాసన నా ముక్కుపుటాలకు చాలా స్పష్టంగా తగులుతోంది. నాకిప్పుడు నవ్వొస్తోంది. చాలాకాలం తర్వాత నాపేరు ప్రజల్లో బాగా నానుతోంది. అసలు ఇప్పుడు కనుక ఎన్నికలొస్తే నాదే అంతిమ విజయం. పార్టీ పెట్టాలన్న ఆలోచన నాకింతవరకు రానందుకు నన్నునేనే తిట్టుకుటున్నాను. నా దూకుడికి అధికారపార్టీ బిత్తరపోతోంది. అసలు ఎప్పుడు ఏరూపంలో ఎటాక్ చేస్తానో తెలియక విలవిల్లాడుతోంది. అదీ మన స్పెషాలటీ.

`అసహనం’ అని అమ్మానాన్నా నాకు పేరుపెట్టినప్పటి నుంచి కొంతమంది తమలోని సహనానశక్తిని కోల్పోయి నన్ను అక్కునచేర్చుకున్నారు. అలా ఒకరితర్వాత మరొకరికి నేను బాగా దగ్గరయ్యాను. ఎప్పుడు సహనశీలతతో ఉండేవారిలో సైతం `ఛాఛీ..’అంటూ అసహనంగా మాట్లాడేలా చేయడమే నాలోని ప్రత్యేకతని ఆ లేతవయసులోనే గుర్తించాను.

నేను ఆట్టే చదువుకోలేదు. చిన్నప్పుడు మాష్టారు గుడింతాలు నేర్పాలని చాలానే ప్రయత్నం చేశారు. కానీ నాకు మాత్రం `ఛ’-గుడింతమంటేనే ఇష్టముండేది. అందులోనూ `ఛ’కు దీర్ఘమివ్వడమన్నా, దానికి గుడిఇవ్వడమన్నా భలే ఇష్టం. మొత్తంగా ఎప్పుడూ `ఛ..ఛా..ఛీ…ఛీ ..’ల దగ్గరే ఆగిపోయేవాడ్ని. అప్పటినుంచి నాదగ్గరకు ఎవరు వచ్చినా, నేను ఎవరిదగ్గరకు వెళ్ళినా `ఛ..ఛిఛీ..’.అంటూ విసుక్కోవడం మొదలుపెట్టేవారు. అలా వారిలో అసహనశీలత పెంచినందుకు నేను ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటాను.

ఆ మరిచాను, నాకో పరమ శత్రువుగాడున్నాడు. వాడిపేరు సహనం. వాడికీ నాకూ ఎప్పుడూ పడదు. స్కూల్లో టీచర్ బెత్తంపుచ్చుకుని దభీదభీమని బాదినా ఆ పిచ్చోడు ఓర్చుకునేవాడు. అదేనేనైతే బెత్తం లాక్కుని టీచర్ వీపుమీద వాతలు తేలేలా కొట్టేవాడ్ని. మా ఇద్దరి మధ్య తేడా ఇదే.

వాడంటే నాకు రోత. వాడిపక్కన నడవాలంటే విసుగు, చిరాకు. కానీ అదేం చిత్రమో, నేను పక్కన నడుస్తున్నా వాడు మాత్రం శాంతాగానే ఉండేవాడు. నేను రెచ్చిపోయినప్పుడు వాడ్ని కసిగా తరిమికొట్టేవాడ్ని. వాడు ఏ గుడిలోనో, బడిలోనో దాక్కునేవాడు. మేధావులను ఆశ్రయించేవాడు. రాజకీయ నాయకులను శరణుకోరేవాడు. నేనేం తక్కువా, వీడి అంతుతేల్చడం కోసం వాళ్లందరిలో దూరి వాళ్ల మనసుమార్చేసేవాడ్ని. నేను సర్వాంతర్యామిని. వాడు, అదే సహనంగాడు ఎక్కడుంటే వాడి పక్కలో బళ్లెంలా నేనూ ఉంటాను. తెలియనివారికి మీమిద్దరం కవలపిల్లలం
అనుకునేవారు. కానీ మేం బద్దశత్రువులం. వాడిపై విజయం నాకు పరమానందం. అదిప్పుడు వచ్చేలా ఉంది. అందుకే నేను నవ్వుతున్నాను. ఇదేదో తప్పైనట్లు చాలామంది ఏడుస్తున్నారు.

నన్ను చూసి కొంతమంది పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. నన్నో రాక్షసుడిగా చిత్రీకరించేవారూ ఉన్నారు. ఆ సహనంగాడ్ని దేవుడిగా చిత్రీకరిస్తూ ఏ బుద్ధుడి అవతారమో అన్నట్లు చూడటం నాకసలు గిట్టదు. ఇది నాలో మరింత కసిపెంచేది. సమయం కోసం ఎదురుచూస్తుండేవాడ్ని. అలాంటి అవకాశం చాలారోజుల తర్వాత ఇప్పుడొచ్చింది. అంతే నా ప్రతాపం చూపిస్తున్నాను.

సహనంగాడి పీకనొక్కేస్తున్నాను. ఇప్పుడు దేశమంతటా నాపేరే మారుమ్రోగుతోంది. సహనశీలత అని శ్లాఘించినట్లుగానే `అసహశీలత’ అని అంతా ముక్తకంఠంతో శ్లాఘించాలి. అందుకే నేను నెమ్మదిగా ఒక్కొక్కరిలో ప్రవేశిస్తున్నాను. దాద్రీ దగ్గర అదే జరిగింది. గోవుమాంసం తిన్నాడని ఒక మనిషిని గొడ్డునుబాదినట్లు బాదింది నా మనుషులే. నేను ఆవహించబట్టే వారు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. అక్కడితో ఆగలేదు. ఇతర చోట్ల కూడా రెచ్చిపోయాను. సహనంగాడి సామ్రాజ్యాన్ని కూల్చివేసే సమయం ఆసన్నమైంది. అందుకే రాజకీయ నాయకులను, మేధావి వర్గాన్ని ఉసిగొలిపాను. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా సహనంగాడు లేడన్న భ్రాంతి కలిగించాను. చివరకు రాష్ట్రపతిని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాం.

వాళ్లు, `మేం మేధావులం’…అంటూ తెగ ఫీలైపోతున్నారేగానీ నిజానికి పప్పులో కాలేస్తున్నారు. అందుకే నేను ముందుగా రాజకీయనాయకులను నావైపుకు తిప్పుకుని వారిచేత మేధావి వర్గాన్ని నావైపు తిరిగేలా చేశాను. దీంతో వారిలో అసహనం పెరిగిపోయింది. దేశంలో సహనశీలత పెరగాలంటూనే వాళ్లే అసహనంగా మైక్ ల ముందు `ఛ..ఛీఛీ’ అంటూ మాట్లాడే స్థితికి తీసుకెళ్ళాను. బాగుందికదూ…అదే నా చాతుర్యం. అందుకే నాకు నవ్వాగడంలేదు. గతంలో వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలను తిప్పికొట్టాలనిపించేలా చేసింది నేనే. పద్మభూషణ్ అయినా సరే, మరే భూషణమైనా సరే నచ్చకోతే తీసేయాల్సిందే. సీను అంతదాకా తీసుకొచ్చాను. ఒక పెద్దాయన ముఖం మీద ఇంకు జల్లేలా చేసిందీ, షారుఖ్ చేత మాట్లాడించింది నేనే.

ఇక రాజకీయనాయకులు నాకా చాలా ఇష్టమైనవాళ్ళు. ఒక చిన్న సందుదొరికేతేచాలు, అందులోనుంచే రెండుమూడు పార్టీలు దూరిపోతాయి. సందు నేనిచ్చాను, దూరగలిగే శక్తి వారిదగ్గరుంది. అంతే ఉభయకుశలోపరి. వామపక్షాలవాళ్లకు ఇప్పుడు చేతినిండా పని. కాంగ్రెస్ అయితే ఎగిరిగంతేసింది. 2014ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఎక్కడ సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తోంది. ఇప్పుడు నేను దేశమంతటా వ్యాపించగానే , మండుటెండల్లో నైరుతీ రుతుపవనాలు వ్యాపించినంత సంబరపడిపోతోంది. మేడం సోనియాకైతే కాలునిల్వడంలేదు. అందుకే ర్యాలీలు, రాష్ట్రపతి రోడ్ అంటూ గిరగిరా తిరిగేస్తోంది.

బిజేపీ వాళ్లను మాత్రం నేను వదిలిపెడతానా… అబ్బేలేదు. వారిలో కూడా అసహనం రెచ్చగొడుతున్నాను. దీంతో పాతవిషయాలు తోడుతున్నారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత సంఘటనల్లాంటివి తవ్వితీస్తున్నారు. అసహనానికి అసహనమే విరుగుడన్నది బిజేపీ ఆలోచన. భేష్.. ఇదే నాకు కావాల్సింది. దేశంలో అసహన వాతావరణం లేనేలేదనీ, ఇదంతా రాజకీయశక్తుల కుట్రేననీ, అసలు మీ టైమ్ లో కూడా అసహనం రాజ్యమేలిందంటూ ఘాటుగా విమర్శించడం మెదలుపెట్టారు. అంటే అసహనం
అనే నేను అప్పుడూ, ఇప్పుడూ ఉన్నట్లు వారే అంగీకరించినట్లేగా. ఇదంతా నా మాయే.

మొత్తానికి నా శత్రువు సహనంపై నేను విజయం సాధిస్తున్నాను.
కానీ నా భయం నాకుంది. గతంలో నాకెన్నో చేదుఅనుభవాలున్నాయి. నా శత్రువు చాలా కూల్ గా ఉంటూనే చివరకు నన్ను నిర్వీర్యం చేసేవాడు. త్వరలోనే దీపావళి రాబోతుంది. మరి నరకాసురుడ్ని వధించినట్లు నన్ను కూడా వధిస్తారా? చివరకు సహనశీలతే తిరిగి రాజ్యమేలుతుందా ? నా పన్నాగలన్నీ, నా రాజకీయ కుట్రలన్నీ వీగిపోతాయా? ఏమో… నా భయం నాది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close