రాజమౌళి కొత్తచిత్రంలో నో ప్రభాస్,నో రానా!

ఫేక్ ఛానెల్ `ఉత్తుత్తినే త్రిబుల్ నైన్’ లో వార్తలొస్తున్నాయి..

యాంకర్ నాగ్: ఫేక్ న్యూస్ ఛానెల్ `ఉత్తినే త్రిబుల్ నైన్’ అబద్దపు నిరంతర వార్తాస్రవంతికి స్వాగతం. నాపేరు నాగ్. సంచలన వార్తను వండివార్చే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాము. చూస్తూనే ఉండండి, ఫేక్ ఛానెల్ ఉత్తినే- త్రిబుల్ నైన్.

(ఉత్తినే ఛానెల్ లోగో గిర్రున రెండుమూడుసార్లు తిరిగాక)

క్షణాల్లో ఫేక్ న్యూస్ సిద్ధంచేయడంలో అంతర్జాతీయస్థాయిలో అవార్డులు, రివార్డులు అందుకున్న ఏకైక ఫేక్ ఛానెల్ ఉత్తినే త్రిబుల్ నైన్, ఈరోజు మరో సంచలన వార్తను మీకోసం సిద్ధంచేస్తోంది. ఈగ, బాహుబలి చిత్రాలను తీసి తెలుగువాడి సత్తాఏమిటో ప్రపంచానికి చాటిన రాజమౌళి ఇప్పుడు మరో సరికొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా పనిలేని ప్రేమ్ ని అడిగి తెలుసుకుందాం…

ప్రేమ్..ప్రేమ్… చెప్పు, రాజమౌళి ఇప్పుడు కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారా ? ఆ వివరాలు చెప్పు…

రిపోర్టర్ ప్రేమ్ : అంతగా ఆవేశపడకు నాగ్. నువ్వు ఎంత ఆవేశంగా అరిచినా నేను కూల్ గానే చెబుతాను . నేను ప్రభుత్వ ఛానెల్ నుంచి వచ్చినోడ్ని .

నాగ్ : సరే, అలాగే చెప్పు. వివరాలేమిటీ?

ప్రేమ్ : రోజంతా ఇంట్లో కూర్చుని ఈ ఫేక్ న్యూస్ తయారుచేశాను నాగ్. ఇంత కష్టపడి తాయరుచేస్తే, నువ్వేమో యమస్పీడ్ తో ఓ నిముషాల్లో ఊదేస్తావ్.

నాగ్ : నీ బాధ నాకర్థమైంది ప్రేమ్, సరే, నేనూ జీడిపాకంలా సాగదీస్తాను. ఎలాగూ వార్తలేమీలేవు. చెప్పుప్రేమ్, చెప్పు.

ప్రేమ్ : బాహుబలి చిత్రం సక్సెస్ కావడంతో రాజమౌళి ఈమధ్య మహాభారతం పై సినిమా తీద్దామని అనుకున్నారు. అయితే, ఆఛాన్స్ తివిక్రమ్ కొట్టేసినట్టు తెలుస్తోంది నాగ్. దీంతో రాజమౌళి తన ప్లాన్ మార్చేసుకుని మరో కథ తీసుకున్నారని తెలిసింది. కొత్త సినిమాకు టైటిల్ ని కూడా రెడీచేసుకున్నారు. మహాభారతం తనకు దక్కలేదన్న కసి ఆయన కళ్లలో చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతోంది నాగ్.

నాగ్ : (రెట్టింపు ఉత్సాహంతో) వావ్ఁ అయితే, ఏమిటా సినిమా ?, అలాగే రాజమౌళి కసిగా, కోపంగా, పట్టలేనంత ఆగ్రహంగా ఉన్నారంటున్నావ్. మరి కోపంలో రాజమౌళి ఎవరైనా తిట్టేశారా? ఆవేశంతో ఊగిపోయారా? అక్కడ ఎంతమంది గుమిగూడారు? తొక్కిసలాటలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా?? ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?? ఎవరైనా నాయకులు ఒదార్చడానికి వస్తున్నారా? చెప్పు ప్రేమ్…

ప్రేమ్ : నీ యంకమ్మా, నీకెవర్రా ఈ ఉద్యోగం ఇచ్చింది. సినిమా వార్తఏదో అల్లి నేను చెబుతుంటే, నువ్వేంట్రా, మరీ అంతగా రెచ్చిపోతున్నావ్. కళ్లలో కసికనబడుతుందని నేనంటే, నువ్వు కోపం, పట్టలేనంత ఆగ్రహం, తిట్టేశారా? ఆవేశంతో ఊగిపోయారా ?? అంటూ ఆ ప్రశ్నలేంట్రా బాబోయ్.. ఇంకా ఏమన్నావ్…ఆఁ మధ్యలో తొక్కిసలాటేమిటీ, ఓదార్పుయాత్ర ఏమిటీ నీబొంద, పైగా గాయాలంటావా, పరిస్థితి ఎలా ఉందని అడుగుతావా? ఛీ, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను…సర్లే, మధ్యలో అడ్డుతగలకు, ఆఁ ఎంచెబుతున్నాను, సినిమా టైటిల్ గురించేగా.. ఆ చిత్రం పేరు `భద్రుడు’. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీఅయింది నాగ్.

నాగ్ : (నీరసంగా) ఈ భద్రుడెక్కడి నుంచి వచ్చాడు ప్రేమ్?

ప్రేమ్ : అలా తేలికగా కొట్టిపారేయకు నాగ్. కథ బాగోలేకపోతే రాజమౌళి తీసుకోరుకదా. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ కూడాఉంది , టాగ్ లైన్ తో కలుపుకుంటే చిత్రం పేరు – భద్రుడు – ఓ లంకావాసి.

నాగ్: అంటే, శ్రీలంక సమస్యలపైన తీస్తున్నారా ప్రేమ్?

ప్రేమ్ : నువ్వుఅనుకుంటున్నది నిజమే నాగ్, అయితే ఈనాటి సమస్యలుకావవి. రావణాసురుడు లంకను పాలించే సమయంలో తలెత్తిన సమస్యలపై చిత్రం ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది నాగ్.

నాగ్: (మళ్ళీ నీరసంగా) అంటే, భారతం కథని తివిక్రమ్ లాగేసుకున్నాడని ఈయన రామాయణంపట్టుకున్నాడా ? నువ్వు కొద్దిగా చెబితే చాలు, చాంతాడంత అల్లుకోగలడు ఈ నాగ్. ఇండస్ట్రీలో 10 ఇయర్స్ కంప్లీటెడ్ ఇక్కడ.

ప్రేమ్ : సర్లే, నీ వాగుడు ఎప్పుడూ ఉండేదే, నువ్వలా రాజమౌళిని తీసిపారేయకు, ఈ కథ రామాయణనేపథ్యంలో సాగినా, అసురుల బాధలు, కన్నీళ్లు, కష్టాలమీద ఉంటుందని నేను పసిగట్టేశాను.

నాగ్ : భేష్. నువ్వుచెప్పేదంతా వింటుంటే, ఎలా ఈ వార్త వండేసావో నాకర్థమైందిలే (అదోలా నవ్వేసి) ఆనంద్ నీలకంఠన్ రాసిన అసుర నవల చదివుంటావ్ కదూ… (ఇన్వెస్టిగేట్ చేసినట్టు ఫోజిచ్చేశాడు)

ప్రేమ్ : నిజాయితీగా ఒప్పుకుంటున్నాను నాగ్, అంతే, లేకపోతే రోజుకో ఉత్తుత్తి వార్త కావాలంటే ఎక్కడినుంచి వస్తోంది ?

నాగ్: సరే, బాగానే అల్లుతున్నావ్. ఇంతకీ భద్రుడు కథనురాజమౌళి ఎలా నడిపించబోతున్నారంటావ్?

ప్రేమ్ : అలా అడిగావ్ బాగుంది, నాకు అందిన సమాచారం ప్రకారం, మొదటి సీన్ ఇలా ఉంటుంది.. అది రక్తసిక్తమైన యుద్ధభూమి. అక్కడ రావణాసురుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పక్కనే ఒక సామాన్యపౌరుడైన భద్రుడు చావుబతుకులమధ్య ఉంటాడు. వీరిద్దరిన్నీ తినడానికి ఎలుకులు పాకుతుంటాయి. రాబందులు శరీరాలమీద వాలుతుంటాయి. నెత్తుటి గాయాలమీద ఈగలు ముసురుతుంటాయి.

నాగ్ : భేష్. బాగుంది. బాగుంది. చాలా రుచిగాఉంది… వినడానికే ఆనందంగా ఉంది.

ప్రేమ్ : అదేమరి, రక్తం, శవాలు, ఈగలు, రాబందులు అనగానే ఎక్కడలేని ఊపొచ్చేస్తుందినీకు.

నాగ్ : సారీ, ప్రేవేట్ ఛానెల్ లో చేరినప్పటి నుంచి అతిగా స్పందించడం అలవాటైంది. ఈమధ్య గుడిపూజారి ఇచ్చిన పానకంలో పుడకొస్తే గంటసేపు వాయించాను.

ప్రేమ్ : ఇప్పుడు నువ్వు కూడా పుడకలాగానే నాకు అడ్డుపడుతున్నావ్. నన్ను చెప్పనీ….

నాగ్ : సరే చెప్పు ప్రేమ్

ప్రేమ్ : నాగ్, ఇప్పుడే అందిన తాజావార్త….

నాగ్ : (ఎగిరిగంతేసినట్టు) ఏంటదీ, చెప్పుచెప్పు. దెబ్బకు రేటింగ్ పెరిగిపోవాలి…ఆఁ

ప్రేమ్ : రాజమౌళి కొత్త చిత్రంలో ప్రభాస్, రానా వంటి బాహుబలి టీమ్ వాళ్లెవరూ లేరు.

నాగ్ : అయ్యో , మరి ఎవరు ఉంటారు?

ప్రేమ్ : నీలాంటివాళ్లూ, నాలాంటివాళ్లు ఉంటారు నాగ్. అంటే టివీ యాంకర్లు, రిపోర్టర్లతో తీస్తారని విశ్వసనీయంగా తెలిసింది నాగ్

నాగ్ ; వెరీగుడ్, అయితే నేను ఈ పోస్ట్ కి రిజైన్ చేస్తాను.

ప్రేమ్ : నేనూ అంతే నాగ్.

నాగ్ : సారీ,ప్రేమ్, మనకు ఆ అవకాశం చైర్మన్ గారు ఇవ్వడంలేదు. ఆయనే రేటింగ్ పడిపోయిందని తిడ్తూ, ఆన్ లైన్ లో మనల్ని ఊస్టింగ్ చేసేశారు.

ప్రేమ్ : ఆఁ…

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close