కంటతడి పెట్టుకున్న అద్వానీ

హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ ఇవాళ కంటతడి పెట్టుకున్నారు. లలిత్ గేట్ కుంభకోణంపై ఇవాళ లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్షాల ఆరోపణలకు, విమర్శలకు బదులిస్తూ విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్ అరగంటపాటు అనర్గళంగా చేసిన ప్రసంగం చూస్తూ అద్వానీ ఉద్వేగభరితులయ్యారు. సభలో సుష్మ పక్కన కూర్చుని ఉన్న అద్వానీ, ఆమె ప్రతిపక్షాల విమర్శలను ఆవేశంగా, ధాటిగా తిప్పికొట్టటంచూసి పలుసార్లు కళ్ళుతుడుచుకోవటం కనిపించింది.ప్రసంగం పూర్తిచేసి కూర్చున్న తర్వాత సుష్మను అద్వానీ వెన్ను తట్టి ప్రశంసించారు. పార్లమెంట్‌లో ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలను చూసిఉన్న అద్వానీ ఇవాళ సుష్మ ప్రసంగాన్నిచూసి ఇలా కంటతడి పెట్టుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుష్మ అద్వానీ శిష్యురాలన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోకూడా సుష్మ ప్రసంగానికి ప్రశంసలు లభిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖైరతాబాద్ మహా గణపతికి వీడ్కోలు.. ట్యాంక్ బండ్ వద్ద ఇదీ పరిస్థితి!

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఘట్టం పూర్తి అయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద గణనాథుడిని నిమజ్జనం చేశారు. 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవాన్ని...

ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెకే బాధ్యతలు

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత, విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అతిశీకి సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. కేజ్రీవాల్...

జానీ మాస్ట‌ర్ కేసు: ఛాంబ‌ర్ ఏం చేస్తోంది?

జానీ మాస్ట‌ర్ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అవ్వ‌డంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. హేమ క‌మిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి విష‌యాల్ని సీరియ‌స్ గా తీసుకొని,...

నెల్లూరులోనూ పెరుగుతున్న గేటెడ్ విల్లాల సంస్కృతి

ప్రజలు రాను రాను జీవన విధానంలో మార్పులు కోరుకుంటున్నారు. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇళ్ల చుట్టూ రణగొణ ధ్వనులు.. ఇతర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close