‘లలిత్‌గేట్‌’పై దద్దరిల్లిన లోక్‌సభ: వెల్‌లోకి దూసుకెళ్ళిన సోనియా

హైదరాబాద్: లలిత్‌గేట్ కుంభకోణంపై కొద్దిరోజులుగా పార్లమెంట్‌లో సాగుతున్న రగడ ఇవాళ పతాక స్థాయికి చేరింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు, నినాదాలు, నిందారోపణలతో పార్లమెంట్ దద్దరిల్లింది. మరోవైపు లోక్‌సభలో ఇవాళ అసాధారణరీతిలో ప్రతిపక్ష నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధి వెల్‌లోకి వెళ్ళి స్పీకర్‌ను నిలదీశారు. ప్రతిపక్షంచేత క్షమాపణ చెప్పించాలంటూ నినాదాలు ఇచ్చారు.

లలిత్ గేట్‌పై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడిపై చెలరేగిపోయారు. మోడి రేడియోలలో, టీవీలో మాట్లాడతారుగానీ, చట్ట సభలలో ఎందుకు మాట్లాడరని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ఏడు ప్రశ్నలు సంధించారు. దీనిపై ఇరుపక్షాలమధ్య మాటల యుద్ధాలతో, నినాదాలతో సభ హోరెత్తింది. బీజేపీకి చెందిన ఒక ఎంపీ సోనియానుద్దేశించి చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ సభ్యులను ఆగ్రహానికి గురిచేసింది. వారు పోడియాన్ని చుట్టుముట్టారు. సోనియా స్వయంగా వెల్ లోకి దూసుకెళ్ళి క్షమాపణ చెప్పించాలంటూ స్పీకర్‌ను నిలదీశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ తలపట్టుకుని కూర్చున్నారు. సభను స్పీకర్ అనేకసార్లు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైనపుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పేనని, అయినా అవి రికార్డులలోకి ఎక్కలేదని చెప్పారు.

తర్వాత మాట్లాడిన విదేశాంగశాఖమంత్రి సుష్మా స్వరాజ్, లలిత్ మోడికి సాయంచేయటంపై తనను సమర్థించుకుంటూ గాంధి కుటుంబాన్ని కడిగిపారేశారు. గాంధికుటుంబం పాత చరిత్ర అంతా తవ్వి విమర్శలు గుప్పించారు. తాను దొంగలాగా చాటుమాటుగా లలిత్ మోడికి సాయంచేశానని రాహుల్ చేసిన విమర్శలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. భోపాల్ దుర్ఘటన జరిగినపుడు యూనియన్ కార్బైడ్ సంస్థ అధినేత ఆండర్సన్‌ను నాడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధి చాటుమాటుగా దేశం దాటించారని, ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నాయకుడు, నాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ సింగ్ తన స్వీయచరిత్రలో రాశారంటూ ఆ పుస్తకాన్ని చూపిస్తూ, దానిలోని వాక్యాలను చదివి వినిపించారు. ఆండర్సన్ తరలించటానికి బదులుగా రాజీవ్ అమెరికా ప్రభుత్వంనుంచి సాయం పొందారని ఆరోపించారు. రాజీవ్ బాల్యస్నేహితుడైన మహమ్మద్ యూనస్ కుమారుడు అమెరికా జైలులో బందీగా ఉండేవాడని, ఆండర్సన్ తరలింపుకు బదులుగా యూనస్ కుమారుడిని విడుదల చేశారని సుష్మా చెప్పారు. రాహుల్ అప్పుడప్పుడూ సెలవుపెట్టి ఎక్కడకో వెళుతుంటారని, ఈసారి వెళ్ళినపుడు తమ కుటుంబ చరిత్ర చదువుకోవాలని ఎద్దేవా చేశారు. ఖత్రోకినుంచి ఎంత ముడుపులు తీసుకున్నదీ అమ్మను అడగాలని రాహుల్‌కు సూచించారు.

తర్వాత మాట్లాడిన రాహుల్ సుష్మ విమర్శలను తిప్పికొట్టారు. మంత్రి ప్రపంచంలోకెల్లా మానవతావాదిలాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సుష్మా తన చేయి పట్టుకుని, తనపై అంతకోపం ఎందుకని అడిగారని, తనకు ఆమెపై వ్యక్తిగతంగా కోపం లేదని, ప్రభుత్వంపైనేనని చెప్పారు. లలిత్ మోడికి సాయం ప్రధానిని అడిగే చేశారా అని ప్రశ్నించారు. అవినీతికి తావివ్వనని అన్న మోది దీనిపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. చర్చలో పాల్గొనే దమ్ము మోడికి లేదని అన్నారు.

ఇక ఈ వివాదానికి మూలకారకుడైన లలిత్ మోడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాహుల్ గాంధి లలిత్ గేట్ గురించి కాకుండా, తన బావగురించి, ఇతర కుంభకోణాలగురించి ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకూడా తననొక పనిచేసిపెట్టాలని అడిగారంటూ కొత్త ఆరోపణ చేశారు. అండర్ వరల్డ్‌నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. లండన్‌లో రాహుల్ గాంధిని ఎప్పుడూ కలవలేదని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: ప్ర‌భాస్ టైటిల్ ‘ఫౌజీ’

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో...

ఒక్కొక్కరే ఎందుకు షేర్ ఖాన్ ?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కండువాలు కప్పుతున్నారు. ఏకంగా బీఆర్ఎస్‌ఎల్పీని విలీనం చేసుకుంటామని చెబుతున్నారు కానీ ఆయన ఒక్కొక్కరినే పిలిచి కండువాలు కప్పుతున్నారు. ఇది పార్టీ ఫిరాయింపులేనని ఓ వైపు...

న్యూయార్క్ లో టైమ్స్ స్క్వేర్ – హైదరాబాద్‌లో టీ స్క్వేర్

న్యూయార్క్ లో టైమ్స్ స్క్వేర్ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి. ప్రపంచంలో ఎవరైనా అక్కడ బిల్ బోర్డుపై ప్రకటనలు వేయించుకుని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సినిమా, వ్యాపారం, రాజకీయం ఏదైనా సరే...

జగన్ పెట్టాల్సింది క్యాడర్ దర్బార్ !

జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాజకీయనాయకుడిగా చేయాల్సిన కొన్ని పనులు గుర్తుకు వస్తున్నాయి. అందులో ఒకటి జనంను కలవడం. కనీసం కలిసినట్లుగా నటించడానికైనా ఏర్పాట్లు చేసుకోవాలని అర్జంట్ గా ెడీ అయిపోయారు. ప్రజాదర్బార్ పెట్టబోతున్నారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close