ఉస్మానియా ఆసుపత్రిపై మాట మార్చిన ప్రభుత్వం

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం మాట మార్చింది. అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ను కూలగొట్టే ఆలోచనేదీ తమకు లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సాంస్కృతిక వారసత్వ సంపదలోని భాగమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చబోతున్నారంటూ వస్తున్న వార్తలలో, ఆరోపణలలో నిజమెంతో వెల్లడించాలంటూ హైదరాబాద్‌కు చెందిన స్వామిదాస్ అనే న్యాయవాది హైకోర్ట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్రప్రభుత్వం ఈ విధంగా స్పందించింది. ఆ భవనం హెరిటేజ్ భవనం కిందికి వస్తున్నందును దానిపై తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజలకు ముందుగా తెలపాలని హైకోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పడగొట్టటంమాట అటుంచి, ఆ భవనాన్ని పునరుద్ధరించాలన్నా హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీలనుంచి, అధికారులనుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని హైకోర్ట్ ధర్మాసనం ప్రభుత్వం తరపున వాదించిన తెలంగాణ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుకు సూచించింది. భవనాన్ని కూల్చే ప్రతిపాదనేది లేదని రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హామీని నమోదు చేసుకుని పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ భవనాన్ని కూలగొట్టి అక్కడ పది అంతస్తులతో బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను వేరే చోటకు తరలించటంకూడా ప్రారంభించారు. కేసీఆర్ నిర్ణయంపై ఒక్కసారిగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అయితే తాజా పరిణామంతో ఉస్మానియా ఆసుపత్రిని కూల్చటానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వివిధ పార్టీలవారు, సాంస్కృతిక పరిరక్షణవాదులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close