‘కృష్ణాష్టమి’ ఫస్ట్-లుక్ ఆగస్ట్15న విడుదల

హాస్య నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న సునీల్ ని దర్శకుడు రాజమౌళి మర్యాద రామన్నగా మార్చి అతనికి హీరో స్థాయికి ఎదిగేందుకు తోడ్పడ్డాడు. ఆ తరువాత నుండి సునీల్ ఎక్కువగా హీరో వేషాలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతను ప్రస్తుతం కృష్ణాష్టమి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దానికి (నాగ చైతన్య నటించిన ‘జోష్’ సినిమాకి దర్శకత్వం వహించిన) వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిక్కి గలాని సునీల్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్లు మరియు లోగో ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లు దిల్ రాజు తెలిపారు. దీనికి దినేష్ సంగీతం అందించారు. కెమేర: చోటా.కే.నాయుడు.ఈ సినిమా అక్టోబర్ నెలలో దసరా పండుగ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]